రీసెంట్ గా వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన లావు శ్రీకృష్ణ కి టీడీపీ పార్టీ గెలుస్తుంది అనే నమ్మకం పొయ్యినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు NDA కూటమిగా జనసేన, బీజేపీ లతో జత కట్టింది. అయితే కూటమి ఏర్పడడం వలన ఉపయోగం ఏమి లేదు, జనసేన, బీజేపీ పార్టీలు నామమాత్రపు పార్టీలే. రాష్ట్రంలో బీజేపీ, జనసేన బలం ఏమి కనిపించడం లేదు. వాటితో కలవడం వలన టీడీపీకి అంతగా మేలు జరగదు.
అసలు ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ గెలవాలి అంటే చాలా కష్టపడాలి.. NDA కూటమిలో కలిసిన అంతగా మేలు ఐతే ఏమి జరగలేదు.. అంటూ కొత్తగా టీడీపీలో చేరి ఏదో సాధించేద్దామనుకుని కలలుకన్న ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ మాట్లాడడం అందరికి అనేకంటే ముఖ్యంగా టీడీపీ శ్రేణులకి షాకిచ్చింది.
ఇదంతా చూస్తుంటే ఏపీలో టీడీపీ గెలుస్తుంది అంటే టీడీపీ అభ్యర్థులకే కాన్ఫిడెన్స్ లేదు.. ఇక్కడే అర్థమవుతుంది రాష్ట్రంలో వైయస్ఆర్ సీపీ గ్రాఫ్ ఎంతలా పెరిగిందో.. అంటూ వైసీపీ నేతలు, నాయకులు మాట్లాడుకుంటున్నారు.