Advertisementt

బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంయుక్త

Tue 16th Apr 2024 11:24 AM
samyukta  బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంయుక్త
Samyuktha is entering Bollywood బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంయుక్త
Advertisement
Ads by CJ

స్టార్ హీరోయిన్ సంయుక్త టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. తెలుగులో నిఖిల్ సరసన పాన్ ఇండియా మూవీ స్వయంభుతో పాటు శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో సంయుక్త తెచ్చుకున్న క్రేజ్ తో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. 

హిందీలో ఓ ఇంట్రెస్టింగ్ బిగ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ దక్కించుకుంది సంయుక్త. ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసేందుకు ముంబై వెళ్లింది సంయుక్త. ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న సంయుక్త ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే సంయుక్త తన బాలీవుడ్ మూవీని అనౌన్స్ చేయనుంది. తెలుగుతో పాటు హిందీలోనూ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది సంయుక్త.

Samyuktha is entering Bollywood:

Samyukta is getting ready to enter Bollywood

Tags:   SAMYUKTA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ