ఈమధ్యనే అల్లు అర్జున్ బర్త్ డే రోజున పుష్ప 2 టీజర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాదు యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో పుష్ప ద రూల్ టీజర్ ప్రభంజనం సృష్టించింది అంటూ సోషల్ మీడియాలో ఇంకా హాట్ టాపిక్ గా ఉన్న సమయంలోనే పుష్ప నిర్మాత నవీన్ ఎర్నేని పై నాన్ బెయిలబుల్ కేసు అంటూ కథనాలు రావడం అందరిని షాక్ కి గురి చేసింది.
👉2018 కిడ్నాప్ కేసులో పుష్ప 2 నిర్మాత నవీన్ ఎర్నేని తో పాటు పలువురు ఎన్ అర్ ఐ ల మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు.
👉మాజీ టాస్క్ ఫోర్స్ డీ సీ పీ రాధా కిషన్ రావు సాయంతో క్రియా హెల్త్ కేర్ అనే సంస్థని లాక్కున్నట్లు
చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపారి ఫిర్యాదు.
👉దర్యాప్తులో భాగంగా పుష్ప నిర్మాత నవీన్ ఎర్నేని పాత్రపై ఆధారాలు లభ్యం.
👉దీంతో అరెస్ట్ చేసే అవకాశం
👉ఆగష్టు నెలలో విడుదల కానున్న పుష్ప 2..
👉సినిమా విడుదలకు ముందు నిర్మాతకు అరెస్ట్ గండం..?
👉సినీ రంగంలో చర్చనీయాంశంగా మారిన కేసు.