Advertisementt

సూర్య కంగువ న్యూ పోస్టర్

Sun 14th Apr 2024 06:48 PM
kanguva  సూర్య కంగువ న్యూ పోస్టర్
Double Dope Poster from Kanguva సూర్య కంగువ న్యూ పోస్టర్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కంగువ. ఇవాళ తమిళ న్యూ ఇయర్ పూతండు ఫెస్టివల్ సందర్భంగా కంగువ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కత్తి పట్టిన యుద్ధ వీరుడు కంగువ, మోడరన్ వారియర్ గా  సూర్య ఎదురెదురుగా నిల్చున్న స్టిల్ ను పోస్టర్ గా డిజైన్ చేశారు. గతం, వర్తమానం ఢీకొంటే కొత్త భవిష్యత్ మొదలవుతుంది అని ఈ పోస్టర్ లో క్యాప్షన్ రాశారు. కంగువ నుంచి రిలీజ్ చేసిన ఈ కొత్త పోస్టర్ సినిమా మీద మరింత ఆసక్తి కలిగిస్తోంది.

కంగువ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కంగువ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. 

పది భాషల్లో తెరకెక్కుతున్న కంగువ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

Double Dope Poster from Kanguva:

Double Dope Poster from Kanguva, confirms 2024 release

Tags:   KANGUVA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ