Advertisementt

ప్రభాస్‌, హను రాఘవపూడి బ్యాక్‌డ్రాప్‌ రివీల్డ్

Mon 08th Apr 2024 07:35 PM
prabhas  ప్రభాస్‌, హను రాఘవపూడి బ్యాక్‌డ్రాప్‌ రివీల్డ్
Hanu Raghavapudi Confirms His Next With Prabhas ప్రభాస్‌, హను రాఘవపూడి బ్యాక్‌డ్రాప్‌ రివీల్డ్
Advertisement
Ads by CJ

సీతారామం బ్లాక్‌బస్టర్‌ తో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దర్శకుడు హను రాఘవపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్‌తో యాక్షన్ అంశాలతో కూడిన ఫిక్షనల్ పీరియాడిక్ చిత్రం కోసం చేతులు కలపనున్నారు హను రాఘవపూడి.

వరంగల్‌లోని ఎన్‌ఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో హను రాఘవపూడి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ ప్రభాస్‌తో తన సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. ప్రభాస్‌తో నా నెక్స్ట్ చిత్రం హిస్టరీ ఆల్టర్నేటివ్ నెరేటివ్ తో కూడిన పీరియాడికల్ యాక్షన్.అన్నారు 

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు పాటలను కంపోజ్ చేసినట్లు దర్శకుడు తెలియజేశారు.

ఈ  డెడ్లీ కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు మేకర్స్.

Hanu Raghavapudi Confirms His Next With Prabhas:

Hanu Raghavapudi Confirms His Next With Prabhas Under Mythri Movie Makers

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ