Advertisementt

పుష్ప‌-2 ది రూల్ టీజర్ డేట్ వచ్చేసింది

Tue 02nd Apr 2024 04:44 PM
pushpa: the rule  పుష్ప‌-2 ది రూల్ టీజర్ డేట్ వచ్చేసింది
Teaser For Pushpa: The Rule to drop on April 8 పుష్ప‌-2 ది రూల్ టీజర్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప ది రైజ్‌ ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. దానితో పుష్ప 2పై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు మొదలైనాయి. ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ అయినా స‌న్పేష‌న్‌ అవుతుంది. 

తాజాగా చిత్ర యూనిట్ ఇచ్చిన అప్‌డేట్‌తో అటు ఐకాన్‌స్టార్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబ‌రాల్లో వున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప 1. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. 

2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

Teaser For Pushpa: The Rule to drop on April 8:

Grand Teaser For Pushpa: The Rule to drop on April 8

Tags:   PUSHPA: THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ