Advertisementt

కలియుగం పట్టణంలో నిలుపుదల..

Fri 29th Mar 2024 10:57 PM
kaliyugam pattanamlo  కలియుగం పట్టణంలో నిలుపుదల..
Stopping in Kaliyugam Pattanamlo.. కలియుగం పట్టణంలో నిలుపుదల..
Advertisement
Ads by CJ

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం కలియుగం పట్టణంలో. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29 విడుదలైంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలై మంచి ప్రశంసలను అందుకుంది.

ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. విమర్శకుల ప్రశంసలు కూడా ఈ మూవీకి వచ్చాయి. విశ్వ కార్తికేయ నటన అందరినీ ఆకట్టుకుంది. నూతన దర్శకుడైనా కూడా ఆయన రాసుకున్న కథ, సినిమాను తీసిన విధానానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని నిలిపి వేస్తున్నారు. మళ్లీ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు.

Stopping in Kaliyugam Pattanamlo..:

Kaliyugam Pattanamlo stoppage.. Producers have arranged a new release date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ