Advertisementt

కంగువ టీజర్ రిలీజ్

Tue 19th Mar 2024 07:51 PM
kanguva movie  కంగువ టీజర్ రిలీజ్
Kanguva Teaser out కంగువ టీజర్ రిలీజ్
Advertisement
Ads by CJ

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ మూవీ కంగువ టీజర్ రిలీజైంది. ఈ టీజర్ విజువల్ వండర్ గా ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేసింది. కంగువ పాత్రలో సూర్య పోరాట యోధుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. పులితో సూర్య చేసిన ఫైట్ సీక్వెన్స్ స్క్రీన్ మీదే చూడాలని అనిపించేలా ఉంది. హార్స్ ఫైటింగ్, బిగ్ షిప్ వార్ సీన్స్ తో వరల్డ్ సినిమా హిస్టరీలోని ఎపిక్ వార్ మూవీస్ ను కంగువ టీజర్ గుర్తు చేసింది. హై క్వాలిటీ విజువల్స్ ను దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఎలివేట్ చేసింది. ఉధిరన్ తో కంగువ చేసిన రూత్ లెస్, ఫెరోషియస్ ఫైట్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా కోసం హీరో సూర్య పడిన శ్రమంతా ఆయన మేకోవర్, క్యారెక్టర్ లో రిఫ్లెక్ట్ అయ్యింది.

కంగువ సినిమాను భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కంగువ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న కంగువ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

Kanguva Teaser out:

Kanguva Teaser released 

Tags:   KANGUVA MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ