Advertisementt

మిడిల్ క్లాస్ రాముడిగా దేవరకొండ

Mon 04th Mar 2024 09:24 PM
family star  మిడిల్ క్లాస్ రాముడిగా దేవరకొండ
Family Star teaser out now మిడిల్ క్లాస్ రాముడిగా దేవరకొండ
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబోలో క్రేజీ చిత్రంగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. విజయ్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ స్టార్  సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్ చేశారు. 

గోపీ సుందర్ కంపోజ్ చేసిన దేఖొరో దెఖో.. సాంగ్ తో హీరో క్యారెక్టరైజేషన్ ను వర్ణిస్తూ సాగిన ఈ టీజర్ ఆకట్టుకుంది. సర్ నేమ్ కు సరెండర్ అయి, ఫ్యామిలీ అంటే వీక్ నెస్ ఉన్న కలియుగ రాముడిగా హీరో విజయ్ దేవరకొండను ఈ టీజర్ లో చూపించారు. దేవుడి పూజతో సహా ఇంటి పనులన్నీ చేసుకుంటూ తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటుంటాడు హీరో. వాళ్ల జోలికి ఎవరైనా వస్తే మడత పెట్టి కొడతాడు. అతను వేస్తే బడ్జెట్ షాక్, ప్లాన్ గీస్తే ప్రాజెక్ట్ షేక్ అవుతుంది. 

టీజర్ చివరలో హీరోయిన్ మృణాల్ నేను కాలేజ్ కు వెళ్లాలి. కొంచెం దించేస్తారా.. అని అడిగితే.. లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా.. అంటాడు హీరో. ఇలా హీరో క్యారెక్టర్ లో ఉన్న హోమ్లీ, మ్యాన్లీ, లవ్ లీనెస్ తో టీజర్ ఇంప్రెస్ చేసింది. ఫ్యామిలీ, క్లాస్, మాస్, లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన టీజర్ కంప్లీట్ మూవీని షార్ట్ గా చూసిన ఫీలింగ్ కలిగించింది. 

Family Star teaser out now:

Vijay Devarakonda Family Star teaser out now

Tags:   FAMILY STAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ