అక్కినేని నాగార్జున-విజయ్ బిన్నీ కాంబోలో తెరకెక్కి సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచినా నా సామిరంగ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. నా సామిరంగ లో నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటించగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ ఇతర కీ రోల్స్ లో కనిపించారు.
రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించిన ఈ చిత్రాన్ని దర్శకుడు విజయ్ బిన్నీ రూపొందించారు. సంక్రాంతికి గత నెల 14న గ్రాండ్ థియేటర్స్ లోకి వచ్చిన నా సామిరంగ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని పండుగ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు ఆస్కార్- అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ ఆకర్షణ అయ్యింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో నా సామిరంగ ట్రెండింగ్ మూవీ అవుతుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.