Advertisementt

హార‌ర్ థ్రిల్ల‌ర్ తిమిరం ప్రారంభం

Wed 07th Feb 2024 06:04 PM
timiram  హార‌ర్ థ్రిల్ల‌ర్ తిమిరం ప్రారంభం
Thimiram movie opening హార‌ర్ థ్రిల్ల‌ర్ తిమిరం ప్రారంభం
Advertisement
Ads by CJ

నూత‌న నిర్మాణ సంస్థ‌లు ఎస్‌కేఎస్ క్రియేష‌న్స్ అండ్ ప్ర‌స‌న్న క్రియేష‌న్స్ ప‌తాకంపై ఇన్నోటివ్ కాన్సెప్ట్‌తో రూపొంద‌నున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ తిమిరం చిత్రం బుధ‌వారం ఉద‌యం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ప్ర‌శాంత్ గురువాన హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్ అయ్య‌ర్‌, ప్ర‌స‌న్న‌, వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇషా యాదవ్ క‌థానాయిక‌. హైద‌రాబాద్‌లోని ప‌ర‌మేశ్వ‌ర రామాల‌యంలో ఈ రోజు చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. హీరో, హీరోయిన్‌పై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత‌ల్లో ఒక‌రైన వేణుగోపాల్ స్వీచ్చాన్ చేయ‌గా, ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్ర‌సాద్ క్లాప్ నిచ్చారు.

ఈ సంద‌ర్భంగా హీరో, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ గురువాన మాట్లాడుతూ ఓ ఇన్నోటివ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్లర్ ఇది. క‌థ మీద న‌మ్మ‌కంతో నిర్మాత‌లు నాకు ఈ అవ‌కాశం ఇచ్చారు. హీరోగా, ద‌ర్శ‌కుడిగా ఇది నా మొద‌టి చిత్రం. కొత్త‌ద‌నంతో కూడిన ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌రికి న‌చ్చ‌తుందునే నమ్మ‌కం వుంది అన్నారు. నిర్మాత‌లు మాట్లాడుతూ మూడ న‌మ్మ‌కాల మీద న‌డిచే హార‌ర్ చిత్ర‌మిది. రెండు షెడ్యూల్‌లో 30 రోజుల్లో చిత్రీక‌ర‌ణ పూర్తిచేస్తాం. వేస‌విలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు. సీనియర్ న‌టి జ‌య‌ల‌లిత‌, ప‌ల్స‌ర్ బైక్ ర‌మ‌ణ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: త‌రుణ్ రానా ప్ర‌తాప్‌, డీఓపీ: మ‌హేష్‌, ఎడిట‌ర్‌: శ్రీ వ‌ర‌కాల‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: ప్ర‌సాద్‌.పి.

Thimiram movie opening:

The start of the horror thriller Thimiram movie

Tags:   TIMIRAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ