Advertisementt

ఇన్ స్టాగ్రామ్ లో విజయ్ రేర్ ఫీట్

Mon 05th Feb 2024 05:37 PM
vijay deverakonda  ఇన్ స్టాగ్రామ్ లో విజయ్ రేర్ ఫీట్
The Vijay Deverakonda Reaches 21 Million Followers ఇన్ స్టాగ్రామ్ లో విజయ్ రేర్ ఫీట్
Advertisement
Ads by CJ

హీరో విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లో మరో ల్యాండ్ మార్క్ కు చేరుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఆయన 21 మిలియన్ ఫాలోవర్స్ కు రీచ్ అయ్యారు. అల్లు అర్జున్ తర్వాత అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ నిలిచారు. విజయ్ ఇన్ స్టాగ్రామ్ ను ఇంతమంది ఫాలోవర్స్ అనుసరించడం స్టార్ గా ఆయన క్రేజ్ ను చూపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండ తన కెరీర్ గురించి కొత్త సినిమాల అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. 

అలా విజయ్ సోషల్ మీడియాలో ఒక క్రేజ్ తెచ్చుకున్నారు. తన గురించి వచ్చే రూమర్స్ కు ఈ వేదికల మీద నుంచే క్లారిటీ ఇస్తుంటారు. అలాగే సోషల్ ఇష్యూస్ మీద తన స్పందన తెలియజేస్తారు. ఇవన్నీ జెన్యూన్ గా ఉండటంతో విజయ్ దేవరకొండను తెలుగు నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఫాలో అవుతుంటారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం "ఫ్యామిలీ స్టార్" సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి గ్రాండ్ గా రాబోతోంది.

The Vijay Deverakonda Reaches 21 Million Followers:

The Vijay Deverakonda Reaches 21 Million Followers on Instagram

Tags:   VIJAY DEVERAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ