Advertisementt

రవితేజ మిస్టర్ బచ్చన్ కరైకుడి షెడ్యూల్‌

Wed 24th Jan 2024 08:40 PM
mr bachchan  రవితేజ మిస్టర్ బచ్చన్ కరైకుడి షెడ్యూల్‌
Mr Bachchan off to Karaikudi for a very interesting schedule రవితేజ మిస్టర్ బచ్చన్ కరైకుడి షెడ్యూల్‌
Advertisement
Ads by CJ

మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ మిస్టర్ బచ్చన్ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైయింది. తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ కోసం టీం కరైకుడికి వెళ్ళింది. ఈ షెడ్యూల్‌లో కరైకుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.    

రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్‌లైన్ నామ్ తో సునా హోగా. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్,  టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి.

ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

Mr Bachchan off to Karaikudi for a very interesting schedule:

Raviteja Mr Bachchan off to Karaikudi for a very interesting schedule

Tags:   MR BACHCHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ