Advertisementt

సముద్రఖని, ధనరాజ్ ల రామం రాఘవం ఫస్ట్ లుక్

Mon 22nd Jan 2024 02:08 PM
ramam raghavam  సముద్రఖని, ధనరాజ్ ల రామం రాఘవం ఫస్ట్ లుక్
The first look of Ramam Raghavam సముద్రఖని, ధనరాజ్ ల రామం రాఘవం ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో  ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి రామం రాఘవం టైటిల్ ను ఖరారు చేశారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రామం రాఘవం ఫస్ట్ లుక్ ను ఇరవై రెండు మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేసి చిత్రం పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసి అభినందనలు తెలియజేశారు.. నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.. 

ఫస్ట్ లుక్ పోస్టర్ లో తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు. ఇంటెన్స్ తో కూడిన పోస్టర్ కు విశేష స్పందన లభిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధనరాజ్ కొరనాని తెలిపారు.. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానా కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. హైదరాబాద్, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రామం రాఘవం తమిళ తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

The first look of Ramam Raghavam:

Dhanraj with Samuthirakani in the lead role of Ramam Raghavam

Tags:   RAMAM RAGHAVAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ