Advertisementt

సినిమా జీవితం శ్రీరాముని పాత్రతో అక్కినేని 10వ వర్ధంతి

Mon 22nd Jan 2024 01:12 PM
akkineni  సినిమా జీవితం శ్రీరాముని పాత్రతో అక్కినేని 10వ వర్ధంతి
Today is the 10th birth anniversary of ANR. సినిమా జీవితం శ్రీరాముని పాత్రతో అక్కినేని 10వ వర్ధంతి
Advertisement

శ్రీరాముని పాత్రతో అక్కినేని సినిమా జీవితం ప్రారంభం 

1944లో అక్కినేని నాగేశ్వర రావు నటించిన మొదటి సినిమా శ్రీ సీతారామ జననం. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు శ్రీరాముని పాత్రలో నటించారు.  

ఈరోజు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవంఅంగరంగ వైభవంగా జరగబోతుంది. రామాలయంలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట 22న  రోజు మధ్యాహ్నం 12. 29. 08 సెకన్ల నుంచి 12.30. సెకెన్ల వరకు అంటే 84 సెకన్ల పాటు ఈ ముహూర్తంలో బాల ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బాల రామునికి  ప్రాణ ప్రతిష్ట చెయ్యబోతున్నారు. 

ఈరోజు అక్కినేని నాగేశ్వర రావు 10వ వర్ధంతి

అక్కినేని నాగేశ్వర రావు మొదటి సినిమా శ్రీ సీతారామ జనం గురించి తెలుసుకుందాం. నిర్మాత దర్శకుడు ఘంటసాల బలరామయ్య అక్కినేని మొదట విజయవాడ రైల్వే స్టేషన్లో చూశారు. అప్పుడాయన సీతారామ జాననఁ కోసం నటీనటుల ఎంపిక కోసం ఆంధ్ర ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. తెనాలి నుంచి నాటకం వేసి విజయవాడ స్టేషన్లో రైల్ కోసం వేచి వున్నా అక్కినేని ఆయన దృష్టిలో పెద్దవారు. తానూ వెదుకుతున్న రామ పాత్రధారి అక్కినేనితో కనిపించాడు. అక్కినేనికి పిలిచి సినిమాల్లో నటిస్తావా? అని అడిగారు. ఓ నటిస్తా, మా అన్నయ్యను, అమ్మను అడగండి అని సమాధానము చెప్పాడు. 

ఆ తరువాత అక్కినేని పెద్ద అన్నయ్య రామ బ్రహ్మం, తల్లి పున్నమ్మ ను అడగడం వారు ఒప్పుకోడంతో, అక్కినేని శ్రీ సీతారామ జననం సినిమాలో నటించారు. అలా మొదటి సారి శ్రీరాముని పాత్రలో అక్కినేని కనిపించారు. 

శ్రీరాముడిగా అక్కినేని నాగేశ్వరరావు, సీతాదేవిగా త్రిపురసుందరి రావణుడు, పరశురాముడిగా వేమూరి గగ్గయ్య విశ్వామిత్రుడిగా బలిజేపల్లి లక్ష్మీకాంతం, లక్ష్మణుడిగా బిఎన్ రాజు దశరధుడుగా టి.వెంకటేశ్వర్లు, వశిష్టడుగా పారుపల్లి సత్యనారాయణ జనకుడుగా పారుపల్లి సుబ్బారావు,కౌసల్యగా రుష్యేంద్రమణి _ కైకేయిగా కమలా కోట్నీస్, సుమిత్రగా అన్నపూర్ణ మండోదరిగా కామాక్షి, వేదవతిగా చంద్రకళ ఊర్మిళగా విజయ, రంభగా సౌదామిని అహల్యగా టిజి కమలా దేవి, మాయా రాక్షసిగా రత్న కుమారి నటించారు . ప్రతిభ  ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన శ్రీ సీతారామ జనం సినిమా డిసెంబర్ 1, 1944లో విడుదలయ్యింది. విజయవాడ దుర్గా కళా మందిరంలో ఈ చిత్రం 100 రోజులు ప్రదర్శింపబడింది.

Today is the 10th birth anniversary of ANR.:

ANRs film career began with the role of Sri Ram

Tags:   AKKINENI
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement