Advertisementt

100 కోట్ల క్లబ్బులోకి హను-మాన్

Tue 16th Jan 2024 05:20 PM
prasanth varma  100 కోట్ల క్లబ్బులోకి హను-మాన్
Hanu-Man Reaches 100 Cr Gross Worldwide 100 కోట్ల క్లబ్బులోకి హను-మాన్
Advertisement
Ads by CJ

యంగ్ హీరో తేజ సజ్జ - క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలయికలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మొదటి చిత్రం హను-మాన్. ఈ చిత్రం జనవరి 12 న విడుదలైన ప్యాన్ ఇండియా మార్కెట్ లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంక్రాంతి స్పెషల్ గా జనవరి 11 ప్రీమియర్స్ బ్లాక్బస్టర్ టాక్ తో  విడుదల అయిన ఈ చిత్రం ఇప్పటికి అదే జోరును కొనసాగిస్తోంది.

ఈ చిన్న సినిమా స్టార్ హీరో సినిమాలా అద్భుతాలు చేస్తూ రోజురోజుకు భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం నిజానికి అన్ని చోట్లా టాప్ ట్రెండింగ్ లో ఉంటూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరుకుంది. ఈ స్కేల్ బడ్జెట్‌ సినిమా కు ఇది భారీ విజయం అనే చెప్పాలి. నా ఫస్ట్ 100 కోట్ల మూవీ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా ఎగ్జైట్ అవుతూ ట్వీట్ చేసారు. 

హను-మాన్  సినిమా ఓవర్సీస్ లో 3 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి అక్కడ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Hanu-Man Reaches 100 Cr Gross Worldwide:

Prasanth Varma Pan India Film Hanu-Man Reaches 100 Cr Gross Worldwide

Tags:   PRASANTH VARMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ