మహానటుడు ప్రజానాయకుడు ఎన్.టి. రామారావును భావితరాలకు స్ఫూర్తినిచ్చే ఆశయంతో తమ కమిటీ ఏర్పడిందని చైర్మన్ టి.డి జనార్థన్ తెలిపారు. ఎన్.టి.ఆర్. శతజయంతి సందర్భంగా వెలువరించిన అసెంబ్లీ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, శకపురుషుడు గ్రంథాలపై ఎన్.టి.ఆర్. సావనీర్ మరియు వెబ్ సైట్ కమిటీ సమాలోచనలు కార్యక్రమం బాపట్లలో జరిగింది.
ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ.. ఎన్.టి.ఆర్. మరణించి ఇప్పటి 28 సంవత్సరాలు అవుతున్నా తెలుగు ప్రజల హృదయాలలో ఆయన సృతి చిరస్థాయిగా మిలిగిపోయిందని ఆయన సినిమా నటుడిగా పోషించిన పాత్రలు, ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన పథకాలు పేదవాడి అభ్యున్నతి కోసమేనని ఆయన అన్నారు. ఎన్.టి.ఆర్. స్ఫూర్తినిచ్చే జీవితాన్ని ముందు తరాలకు అంధించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన సూర్యచంద్రులు ఉన్నంత కాలం చిరంజీవిగా తెలుగువారి గుండెల్లో మిగిలిపోతారని శ్రీ జనార్థన్ తెలిపారు.
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. ఎన్.టి. రామారావు శతజయంతి సందర్భంగా వారి ఆశయాలను, ఆదర్శాలను పుస్తక రూపంలో వెలువరించిన కమిటీని అభినందించారు.
వి. నరేంద్ర వర్మ మాట్లాడుతూ.. తెలుగు వారికి మార్గదర్శకుడిగా మిగిలిపోయిన ఎన్.టి. రామారావు వారసత్వాన్ని నారా చంద్రబాబునాయుడుగారు కొనసాగిస్తున్నారని చెప్పారు.
విశ్రాంత తెలుగు అధ్యాపకులు డా. బీరం సుందరరావు గారు శతజయంతి సందర్భంగా ఎన్.టి.ఆర్. జీవితంపై వెలువరించిన మూడు పుస్తకాలు అమూలైమైనవని ముఖ్యంగా శకపురుషుడు సమోన్నుతంగా, సముచితంగా, ఆయనకు నివాళిగా వెలువరించిన కమిటీని ఆయన అభినందించారు.
కమిటీ సభ్యుడు దొప్పలపూడి రామ్ మోహన రావు సభకు స్వాగతం పలుకగా చీరాల తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ కొండయ్య, నాటక రచయిత మన్నె శ్రీనివాసరావు, అట్లూరి నారాయణరావు, శ్రీపతి సతీష్ మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్ భగీరథ సభను సమన్వయం చేశారు. టి.డి. జనార్థన్ అతిధులను సత్కరించారు.