Advertisementt

నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ స్ట్రీమింగ్ ఫిక్స్

Sat 13th Jan 2024 06:15 PM
nithiin  నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ స్ట్రీమింగ్ ఫిక్స్
Extraordinary Man will be streaming from January 19th నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ స్ట్రీమింగ్ ఫిక్స్
Advertisement
Ads by CJ

నితిన్ హీరోగా నటించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను శ్రేష్ట్ మూవీస్, రుచిరా ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా..ఇతర కీలక పాత్రల్లో రాజశేఖర్, రావు రమేష్, బ్రహ్మాజీ, సంపత్ రాజ్ కనిపించారు. 

గత నెల 8వ తేదీన థియేటర్స్ లో రిలీజైంది ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా. జూనియర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన అభినయ్ అనే ఓ కుర్రాడు హీరోగా ఎదిగేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది ఈ సినిమా కథ.  కామెడీ, మంచి మ్యూజిక్, యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మరింత మంది ఆడియెన్స్ కు ఈ సినిమా రీచ్ కానుంది.

Extraordinary Man will be streaming from January 19th:

Nithiin Extraordinary Man will be streaming from January 19th

Tags:   NITHIIN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ