Advertisementt

కన్నప్పతో మంచు వారసుడి ఎంట్రీ

Fri 05th Jan 2024 03:06 PM
avram manchu  కన్నప్పతో మంచు వారసుడి ఎంట్రీ
Avram Manchu Debut in Kannappa కన్నప్పతో మంచు వారసుడి ఎంట్రీ
Advertisement
Ads by CJ

డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న కన్నప్ప సినిమా మీదున్న అంచనాల గురించి అందరికీ తెలిసిందే. న్యూజిలాండ్‌‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది కన్నప్ప టీం. తాజాగా కన్నప్ప నుంచి మరో అప్డేట్‌ను ఇచ్చారు మేకర్లు. ఇప్పటి వరకు ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారని ప్రకటించారు. ఇక ఇప్పుడు మంచు వారి నుంచి మూడో తరం కూడా ఈ కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు.

మోహన్ బాబు వారసుడిగా విష్ణు మంచు రాగా.. విష్ణు మంచు వారసత్వంగా అవ్రామ్ మంచు కన్నప్పతో ఎంట్రీ ఇవ్వనున్నారు. విష్ణు మంచు తన ఐదేళ్ల కొడుకు అవ్రామ్ సినిమా రంగ ప్రవేశాన్ని అద్భుతమైన దృశ్యకావ్యమైన కన్నప్పతో మొదలుపెట్టారు. టార్చ్ బేరర్, లెజెండరీ భారతీయ నటుడు డాక్టర్ ఎం.మోహన్ బాబు నుంచి మొదలుకొని ఈ చిత్రంలో మూడు తరాలకు చెందిన మంచు కుటుంబ సభ్యులు నటిస్తున్నట్టు అయింది. 

న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాల నడుమ 90 రోజులు నిర్విరామంగా షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే.  అవ్రామ్ పాత్రకు కన్నప్పలో ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తుండటంపై విష్ణు మంచు స్పందించారు. ఈ కన్నప్ప సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం యొక్క మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం అంటూ చెప్పుకొచ్చారు.

కన్నప్ప మొదటి షెడ్యూల్ ముగియగానే విష్ణు మంచు తనకు సహకరించిన టీంకు థాంక్స్ చెప్పారు. ఇక ఇప్పుడు తన కొడుకు ఎంట్రీపై స్పందించారు. అవ్రామ్‌తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. సినీ ప్రేమికులందరి ఆశీర్వాదం కోరుకుంటున్నాను. కన్నప్ప ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది అని అన్నారు.

Avram Manchu Debut in Kannappa :

Avram Manchu Debut in Kannappa Sparks a Generational Saga

Tags:   AVRAM MANCHU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ