క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ హను-మాన్. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో చిత్ర నిర్మాత కె నిరంజన్ రెడ్డి విలేకరుల సమావేశంలో హనుమాన్ విశేషాలని పంచుకున్నారు.
నిర్మాతగా ఇది మీ మొదటి సినిమా కదా.. ఈ అనుభవం ఎలా వుంది ?
చాలా ఆనందంగా వుంది. తొలి సినిమానే ఇంత గ్రాండ్ స్కేల్ లో చేయడం, సంక్రాంతి రావడం సంతోషంగా వుంది. హను మాన్.. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన సూపర్ హీరో జానర్ మూవీ. ఆంజనేయ స్వామి చిరంజీవి. ఆయన ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు చేస్తూ వున్నారని మనం నమ్ముతాం. హనుమాన్ మన రియల్, యూనివర్సల్ సూపర్ హీరో. ఆంజనేయ స్వామిని ఎలా చూద్దామని అనుకుంటారో ఈ సినిమా చూసి బయటికి వచ్చినపుడు అది ఫుల్ ఫిల్ అవుతుంది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా ఆనందంగా ఫీలౌతారు.
హనుమాన్ ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైయిందని విన్నాం ?
అవునండీ.. ఐదారు రెట్లు పెరిగింది.
ఇంత నమకాన్ని ఇచ్చిన కంటెంట్ ఏమిటి ?
దర్శకుడు ప్రశాంత్ వర్మ విజన్. ఈ కథ చెప్పినప్పుడే గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా వుంది. మార్వల్ డీసిలా మన ఇండియన్ సినిమాకి ఒక ఫ్రాంచైజ్ లేదు. అలా మనకీ ఒక ఫ్రాంచైజ్ వుండాలని హను మాన్ చేశాం. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇది పెద్దది అవుతుందనే నమ్మకంతో చేశాం. మా నమ్మకాన్ని నిజం చేస్తూ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలలో కేవలం థియేట్రికల్ గా 20కోట్లు జరిగింది. మాకున్న స్టార్ కాస్ట్ కి ఇది హ్యుజ్ నెంబర్. ఓవర్సిస్, కర్ణాటక, నార్త్ ఇండియాతో పాటు నాన్ థియేట్రికల్ లో చాలా మంచి బిజినెస్ జరిగింది. కంటెంట్ పై మాకు వున్న నమ్మకం ఈ రోజు నిజమైయింది.
సంక్రాంతికి దాదాపు ఏడెనిమిది సినిమాలు వున్నాయి కదా..? ఈ పోటీ ప్రభావం సినిమాపై ఎలా వుంటుంది?
హను మాన్ ప్రాజెక్ట్ వరకూ విజయంపై మాకు పూర్తి నమ్మకం వుంది. ప్రతి సినిమాలా మొదటి రోజులు కోసం మేము చూడటం లేదు. చాలా లాంగ్ రన్ వుండే చిత్రమిది. కంటెంట్ బావుంటే లాంగ్ రన్ వుంటుంది. బేబీ, బలగం సినిమాలు దీనిని నిరూపించాయి. మా సినిమా కూడా అలా లాంగ్ రన్ వుండే చిత్రం.
హను మాన్ గ్లోబల్ సక్సెస్ అయ్యే చిత్రమని మీకు ఎప్పుడనిపించింది ?
టీజర్ విడుదలైన తర్వాత ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు. ఈ డిజిటల్ యుగంలో ఇలాంటి ఫీట్ సాధించడం చాలా అరుదు. అప్పుడే ఇది గ్లోబల్ విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. ఈ కంటెంట్ కు కావాల్సిన ప్రతిది ఎక్కాడా రాజీపడకుండా సమాకూర్చాలని నిర్ణయించుకున్నాం.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే సినిమాల్లో మీ భాగస్వామ్యం ఉంటుందా ?
వందశాతం వుంటుంది. ప్రశాంత్ గారికి కూడా ఈ విషయం చెప్పాను. అయితే ఆయన ప్రణాళిలు ఎలా ఉంటాయో కూడా చూడాలి కదా.
మీ ఫ్యామిలీ నేపధ్యం ఏమిటి ?
మా నాన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. మాది నల్గొండ. అయితే నేను మాత్రం హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను. నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. సినిమా అంటే ప్యాషన్ తో ఈ రంగంలోకి వచ్చాను. చాలా ప్యాషన్ తో చేసిన హనుమాన్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. మా బ్యానర్ నుంచి మున్ముందు వచ్చే చిత్రాలన్నీ కంటెంట్ బేస్డ్ గానే వుంటాయి. 25 ఏళ్ళు పాటు సినీ నిర్మాణ రంగంలో వుండాలనే లక్ష్యంతో పరిశ్రమలోకి వచ్చాను.
బాలీవుడ్ లో ప్రమోషన్స్ ఎలా వున్నాయి?
చాలా బావున్నాయ్ అండీ. ట్రైలర్, టీజర్ కి ఆడియన్స్ నుంచి హ్యుజ్ రెస్పాన్స్ వస్తోంది. దాదాపు 200 స్క్రీన్స్ లో చాలా బిగ్గర్ రిలీజ్ చేస్తున్నాం. బాలీవుడ్ లో చాలా పెద్ద రన్ వుంటుంది.
వీఎఫ్ఎక్స్ గురించి ?
హనుమాన్ వీఎఫ్ఎక్స్ క్యాలిటీ అద్భుతంగా వుంటుంది. ప్రశాంత్ వర్మ విజన్ కి తగినట్లు వీఎఫ్ఎక్స్ అవుట్ పుట్ వచ్చింది. ఖర్చు చేసిన ప్రతిది తెరపై కనిపిస్తుంది.
చిరంజీవి గారు హనుమాన్ లో వున్నారా లేదా ?
అది సర్ప్రైజ్. సినిమాలో ఎన్ని సర్ ప్రైజ్ లు ఉన్నాయానేది తెరపై చూసినప్పుడే తెలుస్తుంది (నవ్వుతూ) చిరంజీవి గారు ప్రీరిలీజ్ ఈవెంట్ కి వస్తున్నారు.
రవితేజ గారి వాయిస్ ఓవర్ గురించి ?
ఇందులో కోటి అనే సర్ప్రైజ్ రోల్ వుంది. దీనికి రవితేజ గారు వాయిస్ ఓవర్ చెప్పారు. ఇందుకు రవితేజ గారికి థాంక్స్ కంటే పెద్ద మాట చెప్పాలి. ఆయన సినిమా వుండి కూడా ఈ కాంపిటేషన్ లో సపోర్ట్ చేయడం చాలా గొప్ప విషయం. పరిశ్రమ ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీనే ఆశిస్తుంది.
హనుమాన్ ఎలా వుండబోతుంది ?
హనుమాన్ ట్రైలర్ అందరికీ అద్భుతంగా అనిపించింది. ట్రైలర్ కంటే పదిరెట్లు అద్భుతంగా వుంటుంది సినిమా. వందశాతం ప్రేక్షకులకు నచ్చుతుంది.
అమృత అయ్యర్, వరలక్ష్మీ పాత్రలు ఎలా ఉంటాయి ?
అమృత అయ్యర్, వరలక్ష్మీ పాత్రలు కథలో చాలా బలంగా వుంటాయి. ఆడియన్స్ ఆ పాత్రలకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు.
హాను మాన్ బజ్ కి తగ్గ థియేటర్స్ దొరుకడం లేదనే మాట వినిపిస్తుంది ?
ఈ చిత్రం కోసం దాదాపు మూడేళ్ళు కష్టపడ్డాం. మేము విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆడియన్స్ కూడా సంక్రాంతి మా సినిమాని ఫ్యామిలీతో కలసి చూడాలని కోరుకుంటున్నారు. దీనికి తగినట్లు హనుమాన్ ని స్పెషల్ ఫిల్మ్ గా కన్సిడర్ చేసి సపోర్ట్ ఇవ్వండనేది మా కోరిక. నాలుగు సినిమాలు వస్తున్నపుడు స్కేల్, బజ్ కి తగ్గట్టు సినిమాకి థియేటర్స్ కేటాయింపు ఇవ్వాలనేదే మా విన్నపం.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
మా బ్యానర్ నుంచి ఫిబ్రవరిలో మల్టిపుల్ సర్ ప్రైజింగ్ అనౌన్స్ మెంట్స్ వుంటాయి