పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 625 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటిన సలార్ పలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు ఇంత భారీ విజయాన్ని అందించిన ఫ్యాన్స్, ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెప్పారు ప్రభాస్. ఇన్ స్టాగ్రామ్ లో తన సంతోషాన్ని షేర్ చేశారు. నేను ఖాన్సార్ ఫేట్ డిసైడ్ చేసేలోగా మీరు న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేస్తూ ఉండండి. సలార్ ను ఓన్ చేసుకుని ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు డార్లింగ్స్ అందరికీ థ్యాంక్స్. అని పోస్ట్ చేశారు. ప్రభాస్ చేసిన పోస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ రిప్లైస్ పంపుతున్నారు.
హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాను రూపొందించారు. గతేడాది డిసెంబర్ 22న రిలీజైన సలార్ మరే ఇండియన్ మూవీ సాధించనంత హయ్యెస్ట్ డే 1 ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా తొలి రోజు 178.7 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ లోనూ సలార్ బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.