Advertisementt

న్యూ ఇయర్ స్పెషల్ గా అంజలి మళ్లీ వచ్చింది

Mon 01st Jan 2024 01:43 PM
geethanjali malli vachindhi  న్యూ ఇయర్ స్పెషల్ గా అంజలి మళ్లీ వచ్చింది
Geethanjali sequel titled Geethanjali Malli Vachindhi న్యూ ఇయర్ స్పెషల్ గా అంజలి మళ్లీ వచ్చింది
Advertisement
Ads by CJ

హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. మలయాళ నటుడు రాహుల్ మాధవ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.  ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ  ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్ లో ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్.

గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. కొత్త ఏడాది 2024 ప్రారంభం సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ మేకర్స్ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పాడుబడ్డ భవంతిలో నాట్య కళాకారిణి లుక్‌లో అంజలి కనిపిస్తోంది. ఓ వైపు అంజలి లుక్.. మరో వైపు భవంతి బ్యాక్ డ్రాప్ చూస్తుంటే సరికొత్త కథ, కథనంతో గీతాంజలి మళ్ళీ వచ్చింది ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైందని తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న గీతాంజ‌లి మ‌ళ్ళీ వ‌చ్చింది చిత్రాన్ని  మేక‌ర్స్ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. గీతాంజలి సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో స‌త్య‌, సునీల్‌, ర‌విశంక‌ర్‌, శ్రీకాంత్ అయ్యంగార్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన హార‌ర్ కామెడీ చిత్రాల‌న్నీ ఒక ఎత్తైతే గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చిందిలో హార‌ర్ కామెడీ వాట‌న్నింటినీ మించేలా ఉంటుంది.  

Geethanjali sequel titled Geethanjali Malli Vachindhi :

Geethanjali sequel titled Geethanjali Malli Vachindhi First Look Out Now

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ