Advertisementt

కల్కిలో ఫ్యూచర్ ప్రభాస్ కనిపిస్తాడట

Fri 29th Dec 2023 06:49 PM
nag ashwin  కల్కిలో ఫ్యూచర్ ప్రభాస్ కనిపిస్తాడట
Nag Ashwin LIVE in conversation at TECH FEST 23 కల్కిలో ఫ్యూచర్ ప్రభాస్ కనిపిస్తాడట
Advertisement
Ads by CJ

కల్కి కోసం కొత్త వరల్డ్ ని బిల్డ్ చేశాం. ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో కల్కిలో చూస్తారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె అందరి ఫ్యాన్స్, ఆడియన్స్ గొప్పగా ఎంజాయ్ చేసేలా కల్కి వుంటుంది: డైరెక్టర్ నాగ్ అశ్విన్  

ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ కల్కి 2898 AD. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్,  కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి  ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది.

తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటీ బాంబేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్ ఫెస్ట్23లో కల్కి 2898 AD ప్రత్యేక కంటెంట్ ను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన Q &Aలో కల్కి 2898 AD చిత్రానికి సంబధించిన విశేషాలని పంచుకున్నారు నాగ్ అశ్విన్. 

మిగతా సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు కల్కికి ఎంత భిన్నంగా వుంటుంది.. ? 

-మన దగ్గర సైన్స్ ఫిక్షన్ చిత్రాల ఎక్కువ రాలేదనే చెప్పాలి. కొన్ని టైం ట్రావెల్ సినిమాలు వచ్చాయి  . కల్కి చాలా డిఫరెంట్ ఫిల్మ్. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్ ఫ్యుచరిస్ట్  సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్ లో ఎలా ఉంటాయో చూశాం. కల్కిలో ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా వుండబోతునాయో ప్రేక్షకులు చూస్తారు. కల్కి కోసం దాదాపు ఐదేళ్ళుగా శ్రమిస్తున్నాం. ప్రతి అంశంపై లోతుగా అలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక న్యూ వరల్డ్ ని బిల్డ్ చేశాం. ప్రేక్షకులకు అది తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను.  

టీజర్ లో కొత్త ఆయుధాలు కనిపించాయి.. వాటి గురించి చెప్పండి ? 

 -కల్కి కోసం చాలా డిజైన్ వర్క్ చేశాం. కాన్సెప్ట్ ఆర్టిస్ట్ లు, ప్రొడక్షన్స్ డిజైనర్స్ ఇలా టీం అంతా కలసి చాలా మేధోమధనం చేశారు. ఇందులో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ ప్రతిది భారతీయ మూలంతో ముడిపడి అది భవిష్యత్ లో ఎలా మార్పు చెందే అవకాశం వుందనే అంశంపైన ప్రత్యేక శ్రద్ద తీసుకొని ప్రతిది డిజైన్ చేశాం. తెరపై అది అద్భుతంగా కనిపిస్తుందనే నమ్మకం వుంది. 

ప్రభాస్ గారితో పాటు మితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు కదా.. వారి  పాత్ర గురించి చెబుతారా ? 

-వారి పాత్రలు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పకూడదు. అయితే మితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు , దీపికా పదుకొణె.. వీళ్ళ అభిమానులంతా అమితంగా ఆనందపడే పాత్రల్లో వారు కనిపిస్తారు. ఇదివరకూ ఎప్పుడూ ఇలాంటి పాత్రల్లో వారు కనిపించలేదు. తప్పకుండా ఫ్యాన్స్ ని అలరిస్తారు.  

కల్కికి... 2898 AD అనే టైమ్ లైన్ పెట్టడానికి కారణం ఏమిటి ? 

-దీనికి వెనుక ఒక లాజిక్ వుంది. అయితే అది సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో చెబుతాను(నవ్వుతూ) 

ఈ చిత్రం మ్యూజిక్ కోసం సంతోష్ నారాయణ్ ని తీసుకోవడానికి కారణం ? 

-ఇండియన్ రూట్ తో వరల్డ్ ఫీలింగ్ కలిగించే మ్యూజిక్ ఇచ్చే కొద్దిమంది కంపోజర్స్ లో సంతోష్ నారాయణ్ ఒకరు. అందుకే ఆయన్ని తీసుకోవడం జరిగింది. 

కల్కి కోసం ప్రభాస్ గారు ఎలా మేకోవర్ అయ్యారు ? ఇందులో ప్రభాస్ ని కొత్తగా చూడొచ్చా ?

-కల్కిలో ఫ్యూచర్ ప్రభాస్ ని చూస్తారు(నవ్వుతూ)

కల్కి, విష్ణు అవతారం అంటారు కదా.. మీరు కూడా నాగీ యూనివర్స్ ని ప్లాన్ చేస్తున్నారా ? 

-లేదు(నవ్వుతూ) 

ప్రభాస్, కమల్ హసన్, అమితాబ్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ? 

-అందరూ అద్భుతమైన వ్యక్తులు. గ్రేట్ యాక్టర్స్. చాలా హంబుల్ గా వుంటారు. వారికి సినిమా అంటే ప్రేమ, ఇష్టం. వీరిలో వుండే సిమిలర్ క్యాలిటీ ఇది. 

కల్కి రిలీజ్ డేట్ ఎప్పుడు ? 

-త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం 

కల్కి ట్రైలర్ ఎప్పుడు విడుదల కావచ్చు ? 

-93రోజుల తర్వాత ఉండొచ్చు (నవ్వుతూ) 

Nag Ashwin LIVE in conversation at TECH FEST 23:

Nag Ashwin LIVE in conversation at TECH FEST 23, IIT Bombay

Tags:   NAG ASHWIN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ