Advertisementt

సినిమా గెలుస్తుంది: సాయి ధ‌ర‌మ్ తేజ్

Thu 21st Dec 2023 08:24 PM
sai dharam tej  సినిమా గెలుస్తుంది:  సాయి ధ‌ర‌మ్ తేజ్
Cinema Winning: Sai Dharam Tej సినిమా గెలుస్తుంది: సాయి ధ‌ర‌మ్ తేజ్
Advertisement
Ads by CJ

పాజిటివ్ మైండ్‌సెట్‌తో వుండే అంతే పాజిటివ్ గా వుంటుంద‌ని భావించే వ్య‌క్తుల్లో హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఒక‌రు. ఎల్ల‌ప్పూడూ సినిమా గెల‌వాల‌ని, అందులో తెలుగు సినిమా ఎప్పుడూ ముందుడాల‌ని కోరుకునే వ్య‌క్తి సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ‌. తాజాగా ఆయ‌న సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఆయ‌న చేసిన ఓ పోస్ట్ వైర‌ల్‌గా మార‌ట‌మే కాదు. సినీ ప్రియుల‌ను ఆ పోస్ట్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. తెలుగు సినిమా త‌న స‌క్సెస్‌ఫుల్ ప్ర‌యాణంలో నేడు ఉన్న‌త‌స్థితికి చేరుకుంది.  

మ‌న తెలుగు సినిమా స‌లార్ ఈ రోజు  షారుఖ్‌ఖాన్ డంకీ, హాలీవుడ్ ఫిలిం అక్వామెన్‌తో స‌రిస‌మాన‌మైన క్రేజ్‌తో రిలీజ్ అవ్వ‌డం ఎంతో సంతోషంగా, గ‌ర్వంగా వుంది. మూడు అగ్ర సినీ ప‌రిశ్ర‌మ‌లు ఒకే స‌మ‌యాన ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన సినిమాటిక్ అనుభూతికి ఇవ్వ‌డానికి సిద్దం కావ‌డం గొప్ప విష‌యం. అన్నింటి కంటే ఈ రోజు సినిమా చాలా అగ్ర‌స్థాయిలో వున్న ఫీల్ క‌లుగుతుంది. ఈ అనుభూతి క‌ల‌గ‌డానికి కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికి నా ధ‌న్య‌వాదాలు. డంకీ చిత్రంతో వ‌రుస‌గా మూడు స‌క్సెస్‌ల‌తో హ్య‌ట్రీక్ స‌క్సెస్ సాధించిన షారుఖ్ సార్‌.. యువ‌ర్ క‌మ్ బ్యాక్ ఈజ్ సో గ్రేట్‌. స‌లార్‌తో  వెండితెర‌పై ఫైర్ క్రియేట్ చేయ‌డానికి సిద్దమైన ప్ర‌భాస్ అన్న‌కు, అక్వామెన్ సినిమాకు నా బెస్ట్ ఆఫ్ ల‌క్‌. అంటూ సాయిధ‌ర‌మ్ తేజ్ పోస్ట్ చేశాడు.

Cinema Winning: Sai Dharam Tej:

It feels so proud & fantastic looking back at the long way Telugu cinema has come

Tags:   SAI DHARAM TEJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ