Advertisementt

YS జగన్ బర్త్ డే స్పెషల్: యాత్ర 2 పోస్టర్

Thu 21st Dec 2023 11:08 AM
ys jagan,yatra 2  YS జగన్ బర్త్ డే స్పెషల్: యాత్ర 2 పోస్టర్
Yatra 2 Jagan look YS జగన్ బర్త్ డే స్పెషల్: యాత్ర 2 పోస్టర్
Advertisement
Ads by CJ

మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం యాత్ర 2. ఇందులో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి, వై.ఎస్‌.జ‌గ‌న్‌ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. సినిమాలో ప్రముఖ పాత్రల లుక్స్‌కి సంబంధించిన పోస్టర్స్‌ను మేకర్స్ విడుదల చేస్తూ వచ్చిన మేకర్స్ తాజాగా వై.ఎస్.జగన్ పాత్రను చేస్తున్న కోలీవుడ్ స్టార్ జీవా లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పుట్టినరోజు సందర్భంగా యాత్ర 2 నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేయటం విశేషం. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర  ఆధారంగా యాత్ర చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణను పొందిన ఈ చిత్రంకు కొన‌సాగింపుగా, వైఎస్‌.ఆర్ త‌న‌యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు యాత్ర 2ని తెర‌కెక్కిస్తున్నారు. యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడు యాత్ర 2 ని కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంది. 

ప్రస్తుతం శ‌ర‌వేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

Yatra 2 Jagan look:

YS Jagan Birthday Special: Yatra 2 poster released 

Tags:   YS JAGAN, YATRA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ