Advertisementt

ఈగల్ ట్రైలర్ రివ్యూ

Wed 20th Dec 2023 06:50 PM
eagle trailer  ఈగల్ ట్రైలర్ రివ్యూ
Eagle Trailer Review ఈగల్ ట్రైలర్ రివ్యూ
Advertisement
Ads by CJ

రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ ప్రమోషన్స్ జోరుగా మొదలయ్యాయి. రవితేజను మునుపెన్నడూ లేని మాస్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరక్కేయినా ఈగల్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు లాంచ్  చేశారు.

పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు, నక్సలైట్లకు కూడా మోస్ట్ వాంటెడ్ అయిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో వున్న అనుపమ పరమేశ్వరన్, నవదీప్ తో సీరియస్ గా మాట్లాడుతున్న సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమైంది. తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా.. అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు.. అని నవదీప్ చెప్పిన డైలాగ్ ఆసక్తిని మరింతగా పెంచింది.

అతను ఒక మిషన్‌లో ఉన్న క్రూరమైన హంతకుడు. అతను టర్కీ, జర్మనీ, జపాన్‌లో లావాదేవీలు జరిపిన వ్యక్తి. అతను దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాడు. అతని కథ గత 10 సంవత్సరాలలో బిగ్గెస్ట్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్. ఇదంతా రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించిన హీరో రవితేజ గురించి. తనకి కావ్య థాపర్ పాత్ర రూపంలో ఒక గర్ల్ ఫ్రండ్ వుంది. ఆమె తుపాకీలను ద్వేషిస్తుంది, బుల్లెట్లకు భయపడుతుంది కానీ ఆమె జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అభిప్రాయాన్ని మార్చుకుంటుంది.

ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు... ఆయుధంతో విధ్వంసం ఆపే వాడు దేవుడు... ఈ దేవుడు మంచోడు కాదు... మొండోడు అంటూ ట్రైలర్ చివర్లో రవితేజ చెప్పిన డైలాగ్స్ గూజ్ బంప్స్ తెప్పించాయి.

రవితేజ రెండు విభిన్నమైన గెటప్‌లలో వైవిధ్యం చూపించారు. అతను క్లీన్ షేవ్ లుక్‌లో లవర్‌బాయ్‌గా కనిపిస్తుండగా, గడ్డం, పొడవాటి జుట్టుతో  వైల్డ్, రగ్గడ్ గా కనిపించారు. తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆ క్యారెక్టర్‌కి ఇంటెన్సిటీని తీసుకొచ్చాడు. నిజంగానే మాస్ విశ్వరూపం చూపించారు. యాక్షన్, డ్రామా, లవ్, ఎమోషన్‌తో ట్రైలర్ ప్యాక్డ్ గా వుంది. ఇంతకుముందు విజయవంతమైన కార్తికేయ2 చిత్రానికి రాసిన మణిబాబు కరణం పవర్ ఫుల్ డైలాగ్‌లు రాశారు. కార్తీక్ ఘట్టమనేని లార్జర్ దెన్ లైఫ్ కథతో రవితేజను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. టేకింగ్ టాప్ క్లాస్. కార్తీక్ ఈ సినిమా ఎడిటర్, మణిబాబు కరణంతో కలిసి స్క్రీన్ ప్లే రాశారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.

Eagle Trailer Review:

Eagle Trailer out

Tags:   EAGLE TRAILER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ