Advertisementt

6 హెలికాప్టర్లతో ప్రభాస్ కు సినిమాటిక్ సెల్యూట్

Sun 17th Dec 2023 12:26 PM
prabhas fans  6 హెలికాప్టర్లతో ప్రభాస్ కు సినిమాటిక్ సెల్యూట్
Canadian Prabhas fans gave a cinematic salute to Rebel star with six helicopters 6 హెలికాప్టర్లతో ప్రభాస్ కు సినిమాటిక్ సెల్యూట్
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచమంతటా అభిమానులున్నారు. ఈ ఫ్యాన్స్ ప్రభాస్ పుట్టినరోజున, ఆయన కొత్త సినిమా రిలీజైన సందర్భంలో తమ అభిమానాన్ని వినూత్న పద్ధతిలో ప్రదర్శించడం చూస్తుంటాం. ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ సలార్ మరో ఆరు రోజుల్లో గ్రాండ్ గా థియేటర్స్ లోకి రిలీజ్ కు వస్తోంది. 

ఈ నేపథ్యంలో కెనడాలోని రెబల్ స్టార్ అభిమానులు తమ ఫేవరేట్ హీరో ప్రభాస్ కు ఎయిర్ సెల్యూట్ చేశారు. నేల మీద భారీ సలార్ పోస్టర్ డిజైన్ చేయించి..వివిధ రంగుల్లోని ఆరు హెలికాప్టర్స్ తో గాలి నుంచి ఆ పోస్టర్ కు సెల్యూట్ చేయించారు. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ వీడియోను షేర్ చేసింది. ఓ భారీ హాలీవుడ్ సినిమా స్టైల్ లో యూనివర్సల్ డార్లింగ్ ప్రభాస్ కోసం అభిమానులు చేసిన ఈ ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 22న సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

Canadian Prabhas fans gave a cinematic salute to Rebel star with six helicopters:

Canadian Prabhas fans gave a cinematic salute to Rebel star with six helicopters

Tags:   PRABHAS FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ