Advertisementt

తికమకతాండ మూవీ రివ్యూ

Sat 16th Dec 2023 11:57 AM
thika maka thanda movie  తికమకతాండ మూవీ రివ్యూ
Thika Maka Thanda Movie Review తికమకతాండ మూవీ రివ్యూ
Advertisement
Ads by CJ

తికమకతాండ మూవీ రివ్యూ 

తారాగణం : హరికృష్ణ, రామకృష్ణ , యాని , రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ, యాదమ రాజు, భాస్కర్

తిరుపతిసత్యం సమర్పించు

నిర్మాణం: టి ఎస్ ఆర్ మూవీమేకర్స్

నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు

దర్శకుడు : వెంకట్

కథ : నిరూప్‌కుమార్‌

డి ఓ పి : హరికృష్ణన్

ఎడిటర్ : కుమార్ నిర్మలాసృజన్

సంగీత దర్శకుడు : సురేష్ బొబిల్లి

పి ఆర్ ఓ : మధు వి ఆర్

టి ఎస్ ఆర్ మూవీమేకర్స్ సంస్థ పై ట్విన్స్ హరికృష్ణ రామకృష్ణ హీరోలుగా యాని రేఖా నిరోషా హీరోయిన్స్ గా వెంకట్ డైరెక్షన్లో నిర్మించిన చిత్రం తికమకతాండ. గతంలో విక్రమ్ కె కుమార్, గౌతమ్ మీనన్ దగ్గర పనిచేసిన వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఊరందరికీ మతిమరుపు అనే కొత్త కథాంశంతో మన ముందుకు వచ్చిన సినిమానే ఈ తికమకతాండ. తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో అందమైన లోకేషన్లు గ్రామీణ వాతావరణంలో ఈ చిత్రం నిర్మించడం జరిగింది.

కథ : తికమకతాండ అనే ఒక మారుమూల గ్రామంలో ఊరందరికీ మతిమరుపు అనే సమస్య. ఆ సమస్యను పోగొట్టుకోవడం కోసం అమ్మవారి జాతర చేద్దాం అనుకుంటారు. కానీ ఆ ఊరు అమ్మవారు విగ్రహం మాయమైపోతుంది. అసలు ఈ ఊరికి మతిమరుపు సమస్య ఎలా వచ్చింది? ఊరు గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం ఎలా మాయమైంది? ఆ గ్రామ సమస్యని పరిష్కరించడానికి, విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికి ఊరువాళ్లు హీరోలు పడిన కష్టం ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

నటీనటుల విషయానికొస్తే ట్విన్స్ హీరోలుగా పరిచయమైన హరికృష్ణ రామకృష్ణ ఇద్దరు మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా నటించారు. ఇద్దరు డాన్స్లు ఫైట్లు కూడా అద్భుతంగా చేశారు. గతంలో చూసుకుంటే ట్విన్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఉండగా ఇప్పుడు ట్విన్స్ హరికృష్ణ రామకృష్ణ హీరోలుగా పరిచయమయ్యారు. రాజన్న మూవీ లో మల్లమ్మ పాత్ర పోషించిన ఈ సినిమాలో మల్లికగా కథానాయక గా పరిచయమైంది. ఊరు అమ్మాయి పాత్రలో గాని చాలా అద్భుతంగా నటించింది ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండించింది. ఓహో పుత్తడి బొమ్మ సాంగ్లో నిజంగా పుత్తడి బొమ్మలానె అనిపించింది. ఇంకో హీరోయిన్ గా రేఖా నిరోషా నటించింది. నిడివి తక్కువైనా తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. ఇక దర్శకుడు వెంకట్ పాత్రకు వస్తే దర్శకుడుగానే కాకుండా నటుడిగా కూడా తన ఏంటో నిరూపించుకున్నారు. శివన్నారాయణ గారు బుల్లెట్ భాస్కర్ యాదవరాజు ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారు.

దర్శకుడు వెంకట్ ఎంచుకున్న కథాంశాన్ని నమ్మి టి ఎస్ ఆర్ మూవీ మేకర్ సంస్థ తిరుపతి శ్రీనివాసరావు గారు మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఎక్కడ వెనకడుగు వేయకుండా సినిమాని నిర్మించారు. డిఓపి హరికృష్ణన్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం సినిమాకి మరో  ప్లస్ పాయింట్. సిద్ శ్రీరామ్ పాడిన ఓహో పుత్తడి బొమ్మ సాంగ్ సినిమాకి హైలైట్. సినిమా లొకేషన్స్ బ్యాక్ గ్రౌండ్ నటీనటుల నటన అన్ని సహజసిద్ధంగా ఉన్నాయి.

తికమకతాండ టైటిల్ మూవీకి 100% సెట్అయ్యింది.

పంచ్ లైన్: ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

Thika Maka Thanda Movie Review:

Thika Maka Thanda Movie Telugu Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ