Advertisementt

గుంటూరు కారం: ఓ మై బేబీ వచ్చేసింది

Wed 13th Dec 2023 06:49 PM
guntur kaaram  గుంటూరు కారం: ఓ మై బేబీ వచ్చేసింది
Oh My Baby - Guntur Kaaram second single Out గుంటూరు కారం: ఓ మై బేబీ వచ్చేసింది
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గుంటూరు కారం రాబోతుంది. మహేష్ అభిమానులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొదటి టీజర్ వైరల్‌గా మారింది మరియు మహేష్ బాబు యొక్క కొత్త మాస్ లుక్‌ను అభిమానులు ఎంతగానో ఇష్టపడ్డారు. నవంబర్ 11న చిత్ర బృందం మొదటి గీతం ధమ్ మసాలాని విడుదల చేయగా, అది తెలుగు ఆల్బమ్‌లలో టాప్ చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.

ఇప్పుడు మేకర్స్ మెలోడియస్ సౌండ్‌ట్రాక్ ఓ మై బేబీని రెండవ గీతంగా విడుదల చేశారు. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్-మహేష్ బాబు, త్రివిక్రమ్-థమన్ కలయికల్లో పలు చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు వచ్చాయి. ఇప్పుడు గుంటూరు కారం కూడా మరో భారీ చార్ట్ బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ ధమ్ మసాలా బాటలోనే ఓ మై బేబీ పాట కూడా భారీ చార్ట్‌బస్టర్‌గా మారనుంది. ఈ పాట శీతాకాలపు ఉదయం ఆనందకరమైన మెలోడీని వింటూ పొగలు కక్కే కాఫీ తాగుతున్న అనుభూతిని కలిగిస్తుందని బృందం పేర్కొంది. 

ఈ మెలోడీ గీతాన్ని అత్యంత ప్రతిభావంతులైన గాయకులలో ఒకరైన శిల్పా రావు పాడారు. ఈ సోల్ ఫుల్ మెలోడీకి సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. రెండు పాటల్లోని ఆహార పదార్థాల పోలిక నేపథ్యం అభిమానులను మరియు ప్రేక్షకులను మరోసారి తెరపై త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబుల మ్యాజిక్ కోసం ఎదురుచూసేలా చేసింది. అత్యంత ప్రతిభావంతురాలైన అందాల తార శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటిసున్నారు. 

Oh My Baby - Guntur Kaaram second single Out :

Oh My Baby from Guntur Kaaram second single Out 

Tags:   GUNTUR KAARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ