Advertisementt

SRK డంకీ నుంచి ఓ మాహీ ప్రమోషనల్ సాంగ్‌

Mon 11th Dec 2023 10:38 AM
srk,dunki drop 5  SRK డంకీ నుంచి ఓ మాహీ ప్రమోషనల్ సాంగ్‌
SRK teases the audience with a glimpse of Dunki Drop 5 SRK డంకీ నుంచి ఓ మాహీ ప్రమోషనల్ సాంగ్‌
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం డంకీ. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ 21న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే డంకీ డ్రాప్ 1లో విడుదలైన వీడియో, డంకీ డ్రాప్ 2లో విడుదలైన లుట్ పుట్ గయా.. పాట, డంకీ డ్రాప్ 3లో విడుదలైన నికలే ది కబీ హమ్ ఘర్ సే.. పాట, డంకీ డ్రాప్ 4లో రిలీజైన ట్రైలర్‌తో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రోజు రోజుకీ ఈ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం మేకర్స్ డంకీ డ్రాప్ 5 అంటూ ఓ మాహీ.. అనే ప్రమోషనల్ వీడియో సాంగ్ విడుదల చేస్తున్నారు. ముందుగా ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. 

రీసెంట్‌గా షారూక్ తన అభిమానులు, నెటిజన్స్‌తో #AskSRK సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మాహీ.. సాంగ్ తనకెంతో ఇష్టమని చెప్పటంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

SRK teases the audience with a glimpse of Dunki Drop 5:

SRK teases the audience with a glimpse of  Dunki Drop 5 - O Maahi

Tags:   SRK, DUNKI DROP 5
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ