Advertisementt

యానిమల్ ట్రైలర్ రివ్యూ

Thu 23rd Nov 2023 06:08 PM
animal trailer review  యానిమల్ ట్రైలర్ రివ్యూ
Animal Trailer Review యానిమల్ ట్రైలర్ రివ్యూ
Advertisement
Ads by CJ

రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోతెరకెక్కిన వైల్డ్ యాక్షన్ సాగా యానిమల్ బ్లడీ టీజర్, అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌తో సంచలనం సృష్టించింది. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు యానిమల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

రణబీర్ కపూర్, తన తండ్రి పాత్ర  పోషించిన అనిల్ కపూర్ తో తను చిన్నపిల్లాడిగా వున్నపుడు జరిగిన ఓ సంఘటన చెబుతూ.. ఇప్పుడు చిన్నప్పటి తనలా యాక్ట్ చేయమని తండ్రిని అడిగే ఓ ఇంటెన్స్ సీన్  తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ సన్నివేశం తండ్రి-కొడుకుల కాంప్లెక్స్ రిలేషన్ కు డ్రమటిక్ అండర్ టోన్‌ను సెట్ చేస్తుంది. అనిల్ కపూర్ ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చేస్తాడు. రణబీర్ తన తండ్రిని చంపడానికి ప్రయత్నించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అప్పుడు, రణబీర్, బాబీ డియోల్ మధ్య వైలెంట్ ఫేస్ అఫ్ తెరపైకి వస్తుంది.

రణబీర్ కపూర్ తన నట విశ్వరూపం చూపించారు. తన పాత్ర ఆర్క్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. యువకుడు, భర్త, ప్రతీకారం తీర్చుకునే కొడుడు ఇలా చాలా కోణాలు వున్న పాత్రలో రణబీర్ కపూర్ బ్రిలియంట్ గా నటించారు. అనిల్ కపూర్ తండ్రి పాత్రలో ఎక్స్ ట్రార్డినరీ గా చేశారు. రష్మిక మందన్న రణబీర్ భార్యగా తన పాత్రలో ప్రేక్షకులని కట్టిపడేసింది.

డైలాగ్స్, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ అవుట్ స్టాండింగ్ గా వున్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

Animal Trailer Review:

Animal Trailer Released 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ