Advertisementt

ప్రభుత్వం స్పందించిన తీరుకు కృతజ్ఞతలు -మహేంద్ర

Sun 19th Nov 2023 04:22 PM
ap government  ప్రభుత్వం స్పందించిన తీరుకు కృతజ్ఞతలు -మహేంద్ర
Mahendra family Rs. 20 lakh financial assistance ప్రభుత్వం స్పందించిన తీరుకు కృతజ్ఞతలు -మహేంద్ర
Advertisement
Ads by CJ

కొవ్వూరులో దళిత యువకుడు మహేంద్ర ఉదంతం ప్రభుత్వం స్పందించిన తీరుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

మహేంద్ర ఉదంతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని వారు విజ్ఞప్తిచేశారు. ఈ ఘటన తెలిసినవెంటనే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, తమ కుటుంబానికి అండగా నిలిచారన్నారు.ఈ మేరకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబాన్ని పరామర్శించాల్సిందిగా మంత్రి మేరుగ నాగార్జునను  ఆదేశించారని, సీఎం ఆదేశాల మేరకు వారు వచ్చి తమ కుటుంబానికి ఓదార్పునిచ్చారన్నారు. 

మహేంద్ర కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం చేశారన్నారు. ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించికూడా ఇస్తామని, ఉద్యోగం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కష్టకాలంలో తమ కుటుంబం వెన్నంటి ఉన్న జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మహేంద్ర ఉదంతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దయచేసి రాజకీయాలు చేయొద్దని మహేంద్ర కుటుంబ సభ్యులు విజ్క్షప్తిచేశారు.

Mahendra family Rs. 20 lakh financial assistance:

Thank you for the way the AP Government Responded -Mahendra

Tags:   AP GOVERNMENT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ