Advertisementt

సుధాకర్ కోమాకుల మెమొరీస్ మ్యూజిక్ వీడియో

Sat 18th Nov 2023 10:03 AM
memories music video  సుధాకర్ కోమాకుల మెమొరీస్ మ్యూజిక్ వీడియో
Sudhakar Komakula సుధాకర్ కోమాకుల మెమొరీస్ మ్యూజిక్ వీడియో
Advertisement
Ads by CJ

నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ యువ నటుడు సుధాకర్ కోమాకుల మెమొరీస్ అనే మ్యూజిక్ వీడియోతో రాబోతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. అతి త్వరలో మెమొరీస్ వీడియో సాంగ్ ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో  నివ్రితి వైబ్స్ యూట్యూబ్ వేదికపై రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నివ్రితి వైబ్స్ వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ ను సొంతం చేసుకోవడం విశేషం.

వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్ సైమా అవార్డ్స్ లో నామినేట్ అయిన చోటు అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్ గా.. సోని మ్యూజిక్ లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం మనోహరంకి రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది ఉంటుంది.

ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుంది. 

సుధాకర్ కోమాకుల నేతృత్వంలో నిర్మించబడిన ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది. ఈ సాంగ్ లోని మెలోడీ, వీడియో ఆకట్టుకుంటూ జీవితంలో చోటు చేసుకునే మార్పులని హైలైట్ చేసే విధంగా ఉంటుంది. త్వరలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మ్యూజిక్ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉండండి. సాంగ్ టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది.

Sudhakar Komakula :

Memories Music Video out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ