Advertisementt

KH234 పవర్ ఫుల్ టైటిల్ థగ్ లైఫ్

Mon 06th Nov 2023 07:17 PM
kh234  KH234 పవర్ ఫుల్ టైటిల్ థగ్ లైఫ్
KH234 Title Is Thug Life KH234 పవర్ ఫుల్ టైటిల్ థగ్ లైఫ్
Advertisement
Ads by CJ

ఉలగనాయగన్ కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం 1987లో విడుదలైన వారి కల్ట్ యాక్షన్ డ్రామా నాయకుడు తర్వాత మళ్లీ కలిశారు. 36 సంవత్సరాల తర్వాత లెజెండ్స్ ఇద్దరు పాన్ ఇండియా మూవీ #KH234 కోసం తిరిగి జతకట్టారు.

ఇటివలే గ్రాండ్ గా ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ టైటిల్ ని తాజాగా అనౌన్స్ చేశారు. ఈ మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్ స్టర్ యాక్షనర్ కి థగ్ లైఫ్ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో మైండ్ బ్లోయింగా వుంది. ఎక్స్ ట్రార్డినరీ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులని కట్టిపడేసింది. వీడియోలో  కమల్ హసన్ యాక్షన్ అవుట్ స్టాండింగా వుంది. ఫైట్ సీక్వెన్స్ కమల్ హాసన్ పర్ఫార్మ్ చేసిన బ్రిలియంట్ మార్సల్ ఆర్ట్స్ మార్వలెస్ అనిపించాయి.

మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్ మణిరత్నం టేకింగ్ స్టన్నింగ్ అనిపించింది. రవి కె చంద్రన్ కెమెరా పనితనం అద్భుతంగా వుంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ ఈ సీక్వెన్స్ కి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో క్షణాల్లో నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది.

కమల్ హసన్, మణిరత్నం కల్ట్ క్లాసిక్ కాంబోలో వస్తున్న చిత్రం కావడం, అలాగే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ విక్రమ్ తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో  థగ్ లైఫ్ పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి. టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో అంచనాలు మరింతగా పెంచింది.  

ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయంరవి, బ్యూటీఫుల్ త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్‌లు తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

 

KH234 Title Is Thug Life:

Kamal KH234 Title Is Out

Tags:   KH234
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ