Advertisementt

స్వయంభూ కోసం కత్తి యుద్ధం: నిఖిల్

Sat 04th Nov 2023 04:55 PM
nikhil  స్వయంభూ కోసం కత్తి యుద్ధం: నిఖిల్
Nikhil Turns Ambidextrous స్వయంభూ కోసం కత్తి యుద్ధం: నిఖిల్
Advertisement
Ads by CJ

హీరో నిఖిల్ ల్యాండ్‌మార్క్ 20వ చిత్రం స్వయంభూ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం వియత్నాంలో దాదాపు ఒక నెల రోజులు కఠోర శిక్షణ తీసుకున్నారు నిఖిల్. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌కు చెందిన భువన్,  శ్రీకర్ నిర్మిస్తున్న ఈ ఎపిక్ ఒడిస్సీలో లెజెండరీ యోధుని పాత్రను పోషించడానికి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు నిఖిల్. నమ్మశక్యం కాని యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రంలో నిఖిల్ కొన్ని అద్భుతమైన స్టంట్స్ చేయనున్నారు.

ట్రైనింగ్ సెషన్ పూర్తయిన వెంటనే, నిఖిల్ కత్తి యుద్ధం మొదలైనవాటిలో ప్రోగా మారడానికి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. కఠినమైన ప్రాక్టీస్ సెషన్ నిఖిల్‌ను సవ్యసాచి గా చేసింది. ఇప్పుడు రెండు చేతులతో కత్తియుద్ధం చేయగలుగుతున్నారు. నిఖిల్ షేర్ చేసిన వీడియో.. కత్తి యుద్ధంలో అతని నైపుణ్యాన్ని చూపుతుంది.

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్న సంయుక్త ఈ చిత్రం కథానాయికగా నటిస్తోంది. స్వయంభూ నిఖిల్ కెరీర్ లోనే హై బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. స్వయంభూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది. 

Nikhil Turns Ambidextrous:

Nikhil Turns Ambidextrous, Practicing Sword Fighting With Both Hands For The Epic Odyssey Swayambhu

Tags:   NIKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ