హీరో రామ్ పోతినేని మళ్లీ ఉస్తాద్ మోడ్‌లోకి వచ్చారు. స్కంద మూవీ రిజల్ట్ తో కాస్త డిస్పాయింట్ అయిన రామ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తో చేస్తున్న తన పాన్ ఇండియా చిత్రం డబుల్ ఇస్మార్ట్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. తన మునుపటి చిత్రం స్కంద కోసం బరువు పెరిగిన రామ్, డబుల్ ఇస్మార్ట్ కోసం కొన్ని కిలోల బరువు తగ్గారు.
ఈ సినిమా కోసం రామ్ సిక్స్-ప్యాక్ అబ్స్ సాధించారు. రామ్ పంచుకున్న ఫోటోలు తన కండలు తిరిగిన ఫిజిక్ ని ప్రజెంట్ చేశాయి. రామ్ తన ముఖాన్ని దాచుకున్నప్పటికీ, వెస్ట్ లో మాచోగా కనిపిస్తున్నారు. రామ్‌ని ఈ మేకోవర్ చేసిన క్రెడిట్ పూరి జగన్నాధ్‌కి కూడా దక్కుతుంది.
రామ్, పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్ ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. మాస్, యాక్షన్ సినిమాలని ఇష్టపడేవారికి ఈ సినిమా సరికొత్త అనుభూతినిస్తుంది.