Advertisementt

కార్తి జపాన్ టీజర్ రివ్యూ

Wed 18th Oct 2023 06:36 PM
japan teaser  కార్తి జపాన్ టీజర్ రివ్యూ
Japan Teaser Review కార్తి జపాన్ టీజర్ రివ్యూ
Advertisement
Ads by CJ

హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ జపాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన జపాన్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ టీజర్ ని మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు.

హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒకడు కన్నమేసి రెండు వందల కోట్ల విలువల చేసే నగలు ఎత్తుకుపొతే మీ లా అండ్ ఓర్ద్ ఏం చేస్తుంది ?  

ఈ దొంగతనం స్టయిల్ చూస్తే జపాన్ ది లానే అనిపిస్తుంది

ఇండియా అంతటా జపాన్ పై 182 కేసులు వున్నాయి.

నాలుగు రాష్ట్రాల పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు. కానీ ఒక్కసారి కూడా వాడు ఎవ్వరికీ దొరకలేదు.

జపాన్ రేంజే వేరు. అమ్మాయిలు, గోల్డ్ తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా' ఇలా డిఫరెంట్ పాత్రలు జపాన్ కోసం చెప్పే వాయిస్ ఓవర్ లో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

టీజర్ లో అడ్వెంచరస్ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కార్తి డిఫరెంట్ గెటప్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ఎక్స్ ట్రార్డినరీ లుక్స్, పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని కట్టిపడేశారు కార్తి. చివర్లో ఎన్ని బాంబులు వేసిన ఈ జపాన్ ఎవరూ ఏం పీకలేర్రా అని కార్తీ చెప్పిన డైలాగ్, వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.

అలాగే టీజర్ లో సునీల్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించారు. దర్శకుడు రాజు మురుగన్ ఇంట్రస్టింగ్ గ్రిప్పింగ్ నేరేషన్ తో కథపై క్యురియాసిటీ పెంచారు. 

Japan Teaser Review:

Karti Japan Teaser Released

Tags:   JAPAN TEASER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ