1986 అక్టోబర్ 15 న జన్మించిన సాయిధరమ్ తేజ్ నేటి తో 36 ఏళ్ళు నిండాయి, మన సుప్రీమ్ హీరో తన విశాల హృదయంతో నేడు మన సమాజం అలాగే మన భద్రత కోసం పోరాడే పౌరుల క్షేమం కోసం విరాళాలు ఇచ్చారు.
భారత సైన్యం కోసం 10 లక్షలు, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ పోలీసు అకాడమీకు చెరొక 5 లక్షలు విరాళంగా ఇచ్చారు.
గత సంవత్సరం, పేదరికంలో ఉన్న ఒక వృద్ధ మహిళ పక్కా ఇల్లు కోసం విరాళమిచ్చిన విషయం ప్రజలకు దగ్గర చేసింది.
రిపబ్లిక్ వంటి మంచి అర్థవంతమైన సినిమాలకు పేరుగాంచిన అద్భుతమైన నటుడు, సైనికులను ఎంతో గౌరవిస్తాడు. ఇటీవల
ది సోల్ ఆఫ్ సత్య అనే షార్ట్ ఫిల్మ్‌లో సైనికుడిగా నటించిన విషయం తెలిసినదే.
సంపత్ నంది దర్శకత్వంలో, సాయిధరమ్ తేజ్ ముఖ్య పాత్రలో త్వరలో తెరకెక్కనున్న గాంజా శంకర్ మాస్ ఆక్షన్ ఎంటర్టైనర్ నుండి, నేడు ఫస్ట్ హై విడుదలైంది.