Advertisementt

సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ లుక్

Sun 15th Oct 2023 09:21 AM
gaanja shankar  సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ లుక్
Sai Dharam Tej Gaanja Shankar Mass Assault! సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ లుక్
Advertisement
Ads by CJ

సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్, తన అభిమానులను మరియు మెగా-పవర్ అభిమానులను అలరించడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. 

ఆయన విభిన్న జానర్లలో చిత్రాలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. స్క్రిప్ట్ మరియు దర్శకుడి విజన్ కి తగ్గట్టుగా పాత్ర కోసం ఎల్లప్పుడూ ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఇప్పుడు ఆయన పూర్తి మాస్‌ క్యారెక్టర్‌ మరియు కమర్షియల్‌ యాక్షన్‌ ఫిల్మ్ గాంజా శంకర్ తో రాబోతున్నారు.

విజయవంతమైన మరియు సృజనాత్మక దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు ప్రత్యేకమైన, బలమైన హీరో పాత్రలను సృష్టించడంలో ప్రసిద్ది చెందారు. గాంజా శంకర్ కూడా తనదైన శైలిలో రూపొందనుంది.

ఈ సినిమా ప్రపంచాన్ని, గాంజా శంకర్ పాత్ర స్వభావాన్ని పరిచయం చేస్తూ అనౌన్స్‌మెంట్ టీజర్‌ని సృజనాత్మకంగా రూపొందించారు.

గాంజా శంకర్ అపారమైన యాటిట్యూడ్ మరియు ఎటువంటి ముప్పునైనా తొలగించగల శక్తి కలిగిన వ్యక్తిగా అభివర్ణించబడ్డాడు. నాయక పాత్ర తన శత్రువులపై "మాస్ దాడి"ని ప్రారంభించబోతోందని దర్శకుడు తెలిపారు. నిద్రపోయే ముందు సూపర్ హీరోల గురించి వినడానికి ఇష్టపడే చిన్న పిల్లవాడికి చెప్పే కథ లాగా, దర్శకుడు ఈ కథను వెల్లడించారు.

తన సృజనాత్మకతో సంపత్ నంది ఈ సినిమాపై అంచనాలు, ఆసక్తి ఏర్పడేలా చేశారు. సాయి ధరమ్ తేజ్ ఇప్పటిదాకా పూర్తి మాస్ పాత్రతో రాలేదు. మొదటిసారి ఆయన ఈ తరహా పాత్ర పోషిస్తున్నారు. ‘గాంజా శంకర్‘ తో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మాస్ నిర్వచనం ఇవ్వబోతున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

మ్యాడ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.

రిషి పంజాబీ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాంజా శంకర్‌ కి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Sai Dharam Tej Gaanja Shankar Mass Assault! :

 Gaanja Shankar first look revealed 

Tags:   GAANJA SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ