రామ్‌కార్తిక్, హెబ్బాపటేల్ జంటగా నటించిన నటించిన ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ శుక్రవారం ఆహా ఓటీటీలో రిలీజైంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు.
రామ్‌కార్తిక్ , హెబ్బాపటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఆహా ఓటీటీ ద్వారా శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే...
హేమంత్ (రామ్‌కార్తిక్) ఓ అనాథ. తన స్నేహితుడితో కలిసి కాఫీషాప్ రన్‌చేస్తుంటాడు. అతడి షాప్‌కు కుకీస్ సప్లై చేస్తుంటుంది చైత్ర (హేభాపటేల్). కొద్ది పరిచయంలోనే చైత్రతో ప్రేమలో పడతాడు హేమంత్. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.
కానీ చైత్ర మాత్రం అతడి ప్రపోజల్‌కు నో చెబుతుంది. కొద్ది రోజుల్లో తమ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోనున్నట్లు చెప్పి షాకిస్తుంది. యాక్సిడెంట్‌లో చనిపోయిన తమ పెదనాన్న బళ్లారి నీలకంఠయ్యను(సీనియర్ నరేష్)ను తిరిగి బతికించడానికి తాము ఆత్మతర్పణం చేసుకుంటున్నామని అంటుంది. చైత్రతో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని సేవ్ చేయాలని హేమంత్ ఫిక్స్ అవుతాడు. చైత్ర మెడలో తాళికట్టి ఆమె ఇంట్లో అడుగుపెడతాడు. చైత్ర ఇంట్లో అతడికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి?
చైత్ర కుటుంబసభ్యులను నీలకంఠయ్య ఆవహించేది నిజమేనా? ఆత్మహత్య చేసుకోకుండా చైత్ర కుటుంబాన్ని హేమంత్ కాపాడగలిగాడా? ఆ కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది ఎవరు? తనకు జరిగిన అన్యాయంపై చైత్ర ఎలా ప్రతీకారం తీర్చుకున్నది? అన్నదే ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా కథ.
ఓ యువకుడు సాగించిన జర్నీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీ సాగుతుంది. చివరలో రివేంజ్ డ్రామాతో పాటు తెలిసినవాళ్ల చేతుల్లోనే చిన్న పిల్లలు ఎక్కువగా లైంగికదాడులకు గురువుతున్నారనే సందేశాన్ని ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్.అలాగే స్వామిజీలుగా అవతారం ఎత్తి కొందరు చేసే అకృత్యాల్ని ఆలోచనాత్మకంగా సినిమాలో చూపించారు.
మూఢనమ్మకాల వల్ల తలెత్తే అనర్థాల్ని కమర్షియల్ యాంగిల్‌లో చెప్పాలనే దర్శకుడు ఐడియా బాగుంది. లవ్‌స్టోరీతో ఈ సినిమాను మొదలుపెట్టి ఆ తర్వాత అసలైన కథలోని వెళ్లారు డైరెక్టర్. చైత్ర ఇంట్లో హేమంత్ అడుగుపెట్టిన తర్వాత అక్కడ అతడికి ఎదురయ్యే పరిణామాలు థ్రిల్లింగ్‌ను పంచుతాయి. ఫ్యామిలీ మిస్టరీని సాల్వ్ చేసేందుకు హేమంత్ చేసే ప్రయత్నాలతో ఒక్కో ట్విస్ట్ ను రివీల్ చేస్తూ క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా సినిమా సాగుతుంది. నచ్చితే నమ్మకం...నచ్చకపోతే మూఢనమ్మకం అంటూ వచ్చే కొన్ని డైలాగ్స్ మెప్పిస్తాయి.. ప్రేక్షకులను తన స్క్రీన్ ప్లే తో మాయ చేశాడు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఫిల్మ్ తీయడం హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. తను అనుకున్నది చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా సినిమానే ఇరగదీసాడు..జనాలు ఇంతే మెస్మరైజ్ చేసే లాగా పార్ట్ 2 దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు
మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే సినిమాలో కొన్ని సీన్స్ వచ్చేటప్పుడు నేపథ్య సంగీతం నా భూతో నా భవిష్యత్, తన సంగీతంతో సినిమాను వేరే లవ్ తీసుకెళ్లాడు.
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ డిఫరెంట్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. పాయింట్ బాగున్నా చెప్పిన విధానమే కాస్తంత బోర్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది.