Advertisementt

లియో పవర్ ప్యాక్డ్ ట్రైలర్

Thu 05th Oct 2023 08:18 PM
leo trailer  లియో పవర్ ప్యాక్డ్ ట్రైలర్
LEO Trailer Review లియో పవర్ ప్యాక్డ్ ట్రైలర్
Advertisement
Ads by CJ

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ లియో కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రొమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్ ఇతర ముఖ్య పాత్రలు పోహిస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లియో ట్రైలర్ ని మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. ఒక సీరియల్ కిల్లర్ నడి రోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు. ఆల్రెడీ రోడ్ మీద చాలా మంది చనిపోయారు. హీ ఈజ్ నొటోరియస్. వాడు అందరినీ కాలుస్తున్నాడు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ధైర్యంగా సింహం లా వచ్చి ఆ సీరియల్ కిల్లర్ తిరిగి కాల్చాడు. పోలీస్ ఆఫీసర్ గన్ రీలోడ్ చేసే గ్యాప్ లో సీరియల్ కిల్లర్ కాల్చాడు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ గన్ నీ చేతిలో వుంది. అండ్ యూ హ్యావ్ ఏ క్లీన్ షాట్. ఏం చేస్తారు అని విజయ్ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం టెర్రిఫిక్ అండ్ వైల్డ్  గా సాగింది.

ట్రైలర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్ టార్డినరిగా వున్నాయి. విజయ్ పవర్ ఫుల్ ప్రజన్స్, మ్యాసివ్ యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో వుంది. వైల్డ్ యాక్షన్ తో కట్టిపడేశాడు విజయ్. అలాగే సంజయ్ దత్, అర్జున్ పాత్రలు కూడా డెడ్లీగా వున్నాయి. త్రిష, పాప రూపంలో ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అద్భుతంగా వుంటాయి ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. లోకేష్ కనకరాజ్ తనదైన మార్క్ తో  లియోని అవుట్ స్టాండింగ్ గా ప్రజెంట్ చేశారు.

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ నేపధ్య సంగీతం వేరే లెవల్ లో వుంది. యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా వుంది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి లియో ట్రైలర్ సినిమాపై  మరింత భారీ అంచనాలని పెంచింది  

అక్టోబర్ 19న లియో ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది.  

LEO Trailer Review:

Vijay LEO Trailer Out

Tags:   LEO TRAILER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ