Advertisementt

భగవంత్ కేసరి ట్రైలర్ డేట్ ఫిక్స్

Thu 05th Oct 2023 04:50 PM
bhagavanth kesari  భగవంత్ కేసరి ట్రైలర్ డేట్ ఫిక్స్
Bhagavanth Kesari Theatrical Trailer On October 8th భగవంత్ కేసరి ట్రైలర్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. టీజర్ నుంచి పాటల వరకు సినిమా ప్రమోషన్ ఎలిమెంట్స్ మ్యాసివ్ బజ్‌ని సృష్టించాయి. ఇప్పుడు, సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం ఆసన్నమైంది. అక్టోబర్ 8న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.  

పోస్టర్‌లో బాలకృష్ణ చేతిలో కర్రతో కుర్చీపై కూర్చున్న విజువల్ కనిపిస్తుంది. బాలకృష్ణ ఇంటెన్స్ గా చూస్తుండగా, అతని వెనుక పోలీసు అధికారులు నిలబడి ఉన్నారు. మాస్, యాక్షన్ అంశాలతో పాటు, సినిమాలో హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి.

ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా, నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.

Bhagavanth Kesari Theatrical Trailer On October 8th:

Balakrishna Bhagavanth Kesari Theatrical Trailer On October 8th

Tags:   BHAGAVANTH KESARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ