కోలీవుడ్ హీరో శింబు పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతున్నాడు. 40 ఏళ్ళు వయసు వచ్చినా పెళ్లి పేరు ఎత్తకుండా ఇప్పటివరకు లవ్ ఎఫ్ఫైర్స్ తోనే గడిపేశాడు. టాప్ హీరోయిన్స్ త్రిష, నయనతార, హన్సిక ఇలా హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపి పెళ్ళికి సిద్దమయ్యాడు. ప్రేమ ఓకే.. పెళ్లి చేసుకునేందుకు శింబు అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ ప్రేమలు బ్రేకప్ అయ్యాయి. అయితే గత రెండు నెలలుగా శింబు పెళ్లి విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
శింబు తండ్రి రాజేందర్ ఓ ఇంటర్వ్యూ లో సమయం వచ్ఛినప్పుడు శింబు పెళ్లి జరుగుతుంది అంటూ చెప్పారు. ఇక ఈ మధ్యన రాజేందర్ కి హెల్త్ ఇష్యుస్ రావడంతో ఆయనకి విదేశలలో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇప్పుడు శింబు పెళ్లి మరోసారి వార్తల్లోకి వహ్చింది. శింబు పెళ్లి పీటలెకక్కేందుకు రెడీ అవుతున్నట్లుగా మీడియాలో వినిపిస్తుంది.
శింబు తండ్రి చెప్పినట్టుగా శింబుకి పెళ్లి ఘడియలొచ్చేశాయని.. చెన్నై కి చెందిన ఓ సినీ ఫైనాన్సియర్ కుమార్తె తో శింబు పెళ్లి నిశ్చయమైంది అని, త్వరలోనే శింబు ఏడడుగులు నడిచేందుకు రెడీ అయ్యాడని అంటున్నారు. ప్రస్తుతం శింబు మళ్ళీ ఫుల్ స్వింగ్ లో షూటింగ్స్ చేస్తూ బిజీ లైఫ్ లోకి వచ్చేసాడు.