అర్జున్ రెడ్డితో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించి, తర్వాత కబీర్ సింగ్ రీమేక్ తో హిందీ ప్రేక్షకులను అలరించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. దేశవ్యాప్తంగా సినీ ప్రియుల కోసం మునుపెన్నడూ లేని విధంగా ఓ యాక్షన్ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్ర యానిమల్ డిసెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇంతకుముందు రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్, ప్రీ-టీజర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రంలో రణబీర్ కు జోడిగా నటించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్యారెక్టర్ పోస్టర్ ని విడుదల చేశారు.
రష్మికను గీతాంజలిగా పరిచయం చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. చీర కట్టులో అందమైన చిరునవ్వుతో మెరిసింది రష్మిక. ఆమె నుదిటిపై బొట్టు మరింత ఆకర్షణను జోడిస్తుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాగానే యానిమల్ కూడా సందీప్ రెడ్డి వంగా మార్క్ అద్భుతమైన ప్రేమకథ వుంటుంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యానిమల్ టీజర్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది.ఈ గ్రాండ్ వెంచర్ వెనుక ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ వున్నారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ.. భారీతారాగణం ఈ సినిమాటిక్ మాస్టర్‌పీస్ లో వుంది. ప్రేక్షకులకు విజువల్, ఎమోషనల్ ట్రీట్ ని అందించనుంది.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం - 5 భాషల్లో విడుదల కానుంది.