రుద్రంకోట రివ్యూ

Rudramkota Movie Review

రుద్రంకోట రివ్యూ 

నటీనటులు : అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి, విభీషా జాను, అలేఖ్యా, సీహెచ్ జయలలిత, భాస్కర్ రావు తదితరులు

ఛాయాగ్రహణం : ఆదిమల్ల సంజీవ్ 

బ్యాక్‌గ్రౌండ్ స్కోరు : కోటి

స్వరాలు : సంతోష్ ఆనంద్, యువి నిరంజన్

నిర్మాత : అనిల్ ఆర్కా కండవల్లి

కథ, కథనం, దర్శకత్వం : రాము కోన

విడుదల తేదీ: సెప్టెంబర్ 22, 2023

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్పకులుగా వ్యవ‌హరిస్తూ  కీల‌క పాత్రలో న‌టించిన చిత్రం ‘రుద్రంకోట‌’. రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విభీషా, అలేఖ్య హీరోయిన్లుగా న‌టించారు. చిన్న చిత్రంగా ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. 

కథ :  

భ‌ద్రాచలం ద‌గ్గర రుద్రంకోట అనే  ఊరిలోని క‌ట్టుబాట్లను కాపాడుతూ  కోట‌మ్మ (జ‌య‌ల‌లిత‌) కాప‌లాగా ఉంటుంది. ఊరిలో ఆమె చెప్పిందే వేదం. నిజాయితీతో కూడిన‌ ప్రేమికుల్ని కోట‌మ్మ క‌లుపుతుంటుంది. త‌ప్పుడు బంధాలు బ‌తుకులో చీక‌ట్లను నింపుతుంటాయ‌ని న‌మ్ముతుంటుంది.  అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్లను, కామాంధుల‌ను కోట‌మ్మ ఆజ్ఞతో రుద్ర (అనిల్ ఆర్కా) కాటికి పంపుతుంటాడు. ధృతి (అలేఖ్య) రుద్రంకోట‌లో అడుగుపెట్టడంతో ఊరిలో ఎలాంటి మార్పులు వ‌చ్చాయి. ధృతి ఎవ‌రు? కోట‌మ్మతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది. ఊరి జ‌నాల‌కు దూరంగా రుద్ర స్మశానంలో బ‌త‌క‌డానికి కార‌ణం ఏమిటి? రుద్రను ప్రేమించిన శ‌క్తి (విభీషా) ఏమైంది? అన్నదే ఈ సినిమా క‌థ‌.

నటీ నటులు ఎలా చేశారంటే : కోటమ్మ పాత్రలో జయలలిత నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది.  ఊరి పెద్ద పాత్రలో ఆమె కనిపించింది. సీనియర్ నటిగా జయలలిత తనదైన నటనతో పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రుద్రగా అనిల్ ఆర్కా మాస్ పాత్రలో మెప్పించాడు. ఆడవాళ్లను గౌరవించే పాత్రలో అనిల్ కనిపించాడు.  స్మశాన వాటిక‌లో పెరిగి పెద్దయిన రుద్ర.. కోటమ్మ మాటకు విలువిస్తాడు.  గ్లామ‌ర్ ప‌రంగా హీరోయిన్స్ అలేఖ్య, విభీషా నటన ఆయా పాత్రలకు తగ్గట్టుగా చేశారు. పల్లెటూరి అమ్మాయి శక్తిగా విభీషా జాను ఆకట్టుకుంటే, పట్నం నుంచి పల్లెకు వచ్చిన అమ్మాయిగా అలేఖ్య గ్లామర్ లుక్‌లో అలరించింది. 

విశ్లేషణ :  ఇల్లీగల్ రిలేషన్ వల్ల పిల్లలకు ఎదురయ్యే సమస్యల మీద, లవ్ అండ్ లస్ట్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. చాలా మంచి పాయింట్‌ను దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నాడు. హీరో క్యారెక్టరైషన్‌తో తోడు  కోటి బ్యాక్‌గ్రౌండ్ సినిమాకు ప్లస్ అయ్యింది. జయలలిత సీనియారిటీ, యాక్షన్ ఎపిసోడ్స్, విలేజ్ బ్యాక్‌డ్రాప్ సీన్స్ సినిమాకు మరో స్థాయిలో నిలబెట్టేలా ఉన్నాయి. కానీ స్టోరీ ప్రెజెంటేషన్ విషయంలో రొటీన్‌గా తీసినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లలో సీరియల్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఆదిమల్ల సంజీవ్  సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. ఇలాంటి కథకు  డైలాగులు బలంగా ఉంటే బాగుండనిపిస్తుంది.  సన్నివేశాల నిడివి కత్తిరిస్తే బావుండేది. విజువల్స్, ఎమోషన్స్ మీద దర్శకుడు బాగా చూపించగలిగాడు.  ఐదు పాటలున్నా ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్‌, నిరంజ‌న్  అందించిన మ్యూజిక్ హైలైట్‌గా ఉంటుంది. కోటి బ్యాక్‌స్కోరుతో సినిమాకు హైప్ వస్తుంది. అనిల్ హీరోగా నటిస్తూనే, నిర్మాతగానూ బాధ్యత తీసుకోవడం విశేషం. నిర్మాణ విలువల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 

ఫైనల్‌గా : విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో, కొత్తవాళ్ళతో తీసిన  రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. స్టోరీ లైన్‌లో బలం ఉన్న.. స్ర్కీన్‌ప్లేకు మరింత పదును పెడితే బాగుండేది. ఎలాంటి అంచనాలు లేకుండా  ఒకసారి చూసే సినిమాగా చెప్పొచ్చు.

Rudramkota Movie Telugu Review

rudramkota movie review