Advertisementt

శర్వాకు జోడిగా కృతి శెట్టి..

Thu 21st Sep 2023 12:23 PM
krithi shetty  శర్వాకు జోడిగా కృతి శెట్టి..
Krithi Shetty roped in for Sharwa35 శర్వాకు జోడిగా కృతి శెట్టి..
Advertisement
Ads by CJ

కృతికి బర్త్ డే విషెస్ తెలియజేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..

టాలీవుడ్  అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రాల్లో శర్వానంద్ 35వ సినిమా ఒకటి. భలే మంచి రోజు,  శమంతకమణి, దేవ్ దాస్,  హీరో  వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి చిత్రం *ఉప్పెన* తోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కృతి శెట్టి ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడిగా నటిస్తోంది. ఈరోజు కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో కృతి శెట్టి అందంగా, క్యూట్ గా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్ నుంచి ప్రచార కార్యక్రమాల వేగం పెంచనున్నారు. ఇంట్రెస్టింగ్  పాత్రలో శర్వానంద్ ఈ చిత్రంలో కనిపించనున్నారు.

హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు.జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

Krithi Shetty roped in for Sharwa35 :

It's official! Krithi Shetty roped in for Sharwa35 

Tags:   KRITHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ