Advertisementt

చైతు తో మరొక్కసారి అంటున్న సాయి పల్లవి

Wed 20th Sep 2023 04:33 PM
sai pallavi  చైతు తో మరొక్కసారి అంటున్న సాయి పల్లవి
Sai Pallavi Joins NC23 చైతు తో మరొక్కసారి అంటున్న సాయి పల్లవి
Advertisement
Ads by CJ

నాగ చైతన్య, చందూ మొండేటి, అల్లు అరవింద్, బన్నీ వాసు, గీతా ఆర్ట్స్ #NC23 లో జాయిన్ అయిన సాయి పల్లవి- శరవేగంగా జరుగుతున్న  ప్రీ-ప్రొడక్షన్ పనులు- త్వరలో షూటింగ్ ప్రారంభం

యువ సామ్రాట్ నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి పాన్ ఇండియా చిత్రం #NC23 ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు నెల రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన టీమ్, త్వరలోనే సినిమా షూటింగ్‌ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తెలుగుతో పాటు హిందీలో అనేక కల్ట్ హిట్‌లను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు.

ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్‌లో భాగంగా, నిన్న సినిమాలో హీరోయిన్ కూడా టీమ్‌తో జాయిన్ అయ్యారు. అయితే ఈ రోజు మేకర్స్ ఆమె ఎవరో వెల్లడించారు. వెరీ బ్యూటీఫుల్, ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో హీరోయిన్ గా టీంలో చేరారు. నాగచైతన్య, సాయి పల్లవి గతంలో సూపర్ హిట్ ‘లవ్ స్టోరీ’ చిత్రంలో కలిసి పనిచేశారు. కొత్త సినిమాలో తమ అద్భుతమైన కెమిస్ట్రీతో మనల్ని ఉర్రూతలూగించబోతున్నారు.

#NC23 నాగ చైతన్య, చందూ మొండేటి ఇద్దరికీ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది. హై ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో గ్రాండ్‌గా ఈ సినిమా రూపొందనుంది. కేవలం ప్రీ ప్రొడక్షన్ పనులకే నిర్మాతలు మంచి బడ్జెట్‌ను వెచ్చిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.

Sai Pallavi Joins NC23:

Sai Pallavi Joins The Voyage Of Naga Chaitanya

Tags:   SAI PALLAVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ