Advertisementt

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పై చరణ్ రివ్యూ

Sat 16th Sep 2023 05:36 PM
ram charan  మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పై చరణ్ రివ్యూ
haran shares his Review for Miss Shetty Mr Polishetty మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పై చరణ్ రివ్యూ
Advertisement
Ads by CJ

 

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించి రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ మూవీకి ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీల అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రవితేజ, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్స్ మారుతి, వంశీ పైడిపల్లి, స్టార్ హీరోయిన్ సమంత మెప్పుపొందగా..తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాపై ప్రశంసలు కురిపించారు.

రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ - ఇప్పుడే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చూశాను. సినిమా ఆద్యంతం సరదాగా నవ్వులు పంచుతూ సాగింది. నవీన్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోగా, అనుష్క తన ఛార్మింగ్ తో ఆకర్షించింది. వీరిద్దరి జోడి ఈ సినిమాలో పర్పెక్ట్ గా కుదిరింది. దర్శకుడు మహేశ్ బాబు.పి. నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, ఇతర టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాట్స్ చెబుతున్నా. అని పేర్కొన్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ కు హీరో నవీన్ పోలిశెట్టి రిప్లై ఇస్తూ - మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు మీరు ఇచ్చిన ప్రశంసలు చూసి మాకు ఇప్పటికే పండగ మొదలైందని అనిపిస్తోంది. సినిమా మీకు నచ్చింనందుకు హ్యాపీగా ఉంది. ఈ ఫెస్టివల్ వీకెండ్ కు సరిపోయేంత బూస్ట్ ఇచ్చారు. థ్యాంక్సూ సో మచ్. అని కృతజ్ఞతలు తెలిపారు

యూఎస్ లో ప్రమోషనల్ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న హీరో నవీన్ పోలిశెట్టి నగరంలో థియేటర్స్ విజిట్ చేస్తూ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు.

haran shares his Review for Miss Shetty Mr Polishetty:

Ram Charan shares his Blockbuster Review for Miss Shetty Mr Polishetty

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ