Advertisementt

3రోజుల్లో 3సార్లు పుష్ప చూసా: SRK

Thu 14th Sep 2023 05:10 PM
allu arjun  3రోజుల్లో 3సార్లు పుష్ప చూసా: SRK
Pushpa saw 3 times in 3 days: SRK 3రోజుల్లో 3సార్లు పుష్ప చూసా: SRK
Advertisement
Ads by CJ

తగ్గేదే లే అంటూ పుష్పరాజ్ గా పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు  అర్జున్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని రీక్రియేట్ చేయని సెలెబ్రిటీ లేడు. సినిమాల నుంచి క్రికెట్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప మ్యానరిజమ్స్ ని ఫాలో అయిన వాళ్లే. లేటెస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి అదిరిపోయే ట్వీట్ చేసాడు. ఇటీవలే జవాన్ సినిమాను చూసిన అల్లు అర్జున్.. షారుఖ్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించినందుకు టీమ్ అందరిని అభినందించారు. 

షారుఖ్ మాస్ అవతార్ తో పాటు ఆయన స్వాగ్ చూసి ఫిదా అయ్యినట్లు  బన్నీ తన ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అలాగే విజయ్ సేతుపతి, నయనతార, దీపికా నటనతో పాటు, అనిరుధ్ మ్యూజిక్,డైరెక్టర్ అట్లీ ని కూడా ప్రశంసించారు. అల్లు అర్జున్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. 

అల్లు అర్జున్ చేసిన ట్వీట్ కి కింగ్ ఖాన్ సూపర్బ్ రిప్లై ఇచ్చారు. బన్నీకి థాంక్స్ చెప్పిన షారుఖ్.. పుష్ప సినిమాని మూడు సార్లు చూశానని చెప్పడం గొప్ప విషయం. మూడు రోజుల్లో మూడు సార్లు పుష్ప సినిమా చూసిన నేను మీ నుండి ఏదో నేర్చుకున్నానని ఒప్పుకోక తప్పదు! అంటూ షారుఖ్ ట్వీట్ చేయడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఆనందంలో నింపింది. త్వరలోనే వచ్చి వ్యక్తిగతంగా స్వయంగా బన్నీని కలుస్తానని షారుఖ్ చెప్పడం విశేషం.

Pushpa saw 3 times in 3 days: SRK:

What Shah Rukh Khan said about Allu Arjun Pushpa

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ