బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జవాన్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న హిందీ, తమిళ్, తెలుగులో విడుదలై బాక్సాఫీస్ దగ్గర హిస్టరీని క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జవాన్ సినిమా ఫస్ట్ డే రూ. 129.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి హిందీ చలన చిత్ర చరిత్రలో సరికొత్త సెన్సేషన్‌ను క్రియేట్ చేయటం విశేషం. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమంలో ఫస్ట్ డే కలెక్షన్స్‌కి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను విడుదల చేయటంతో పాటు ఇది ప్రారంభం మాత్రమే.. మీరు చూపించిన ఆశేషమైన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని అందరికీ ధన్యవాదాలను తెలియజేశారు.
అభిమానులు, సామాన్య ప్రేక్షకులతో పాటు సినిమాను చూసిన సెలబ్రిటీలు సైతం జవాన్ అత్యద్భుతం అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జవాన్ బ్లాక్ బస్టర్ సినిమా... డైరెక్టర్ అట్లీ కింగ్ ఖాన్‌తో కలిసి కింగ్ సైజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించారు. అట్లీ కెరీర్‌లో ఇదొక అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుంది. షారూఖ్ మంచి ఫైర్ మీదున్నారు. ఆయన అరా, స్క్రీన్ ప్రెజన్స్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరు. జవాన్ తన రికార్డులను తానే బ్రేక్ చేస్తున్నారు అని జవాన్ పై మహేష్ ట్వీట్ వేశారు. దీనికి షారూఖ్ ఖాన్ స్పందిస్తూ ధన్యవాదాలు. మీకు సినిమా నచ్చినందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. మా సినిమాపై చాలా మంచిగా స్పందించినందుకు మీకు, మీ కటుంబానికి ధన్యవాదాలు. ఇప్పుడు అందరినీ ఎంటర్‌టైన్ చేయటానికి మరింత కష్టపడతాను. లవ్ యూ మై ఫ్రెండ్ అన్నారు.
ఇక దర్శకధీరుడు రాజమౌళి జవాన్ సినిమాను వీక్షించారు. ఆయన కూడా తన స్పందనను తెలియజేశారు. జవాన్ కి చాలా గొప్ప ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. అందుకనే షారూఖ్ ఖాన్‌ని బాక్సాఫీస్ బాద్ షా అని పిలుస్తారు. డైరెక్టర్ అట్లీకి అభినందనలు. తను జైత్రయాత్ర ఇప్పుడు నార్త్‌కి కూడా వెళ్లింది. అద్భుతమైన విజయాన్ని సాధించిన జవాన్ టీమ్‌కి కంగ్రాట్స్ అన్నారు. మీకు ధన్యవాదాలు. మీ సినిమా క్రియేటివిటీ నుంచి మేం నేర్చుకుంటున్నాం. మీరు తప్పకుండా సినిమాను చూడండి. నేను కూడా మాస్ హీరో అని కాల్ చేసి చెప్పండి (నవ్వుతూ) అని షారూఖ్ రాజమౌళికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఎంటైర్ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు జవాన్ వైపు ఆసక్తికరంగా గమనిస్తోంది. ఈ సినిమా వసూళ్ల సునామీ ఏ రేంజ్‌కి వెళుతుందా అని ట్రేడ్ వర్గాలు ఆతృతగా ఉన్నాయి. ఈ సిినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచే సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు సినిమా పోస్టర్స్, గ్లింప్స్, జవాన్ ప్రివ్యూ, ట్రైలర్‌లతో ఈ అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక సినిమా ఈ అంచనాలను మించి ఉండటంతో అభిమానుల ఆనందానికి మాటలు లేవనే చెప్పాలి. అంతటా జవాన్ మానియా అలుముకుంది.
షారూఖ్ ఖాన్ ఇంట్రడక్షన్ సీన్స్, వావ్ అనిపించే యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే మేకింగ్‌తో పాటు నయనతార గ్లామర్, పెర్ఫామెన్స్, విజయ్ సేతుపతి విలక్షణమైన విలనిజం.. దీపికా పదుకొనె వండర్ఫుల్ యాక్టింగ్.. సూపర్బ్ అనిరుద్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమా చూసే ప్రేక్షకుడిని అబ్బురపరుస్తున్నాయి.
Click Here: >Jawan Review